AP Spandana Toll Free Number 2020

ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. స్పందన అనేది సామాన్య ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చు. స్పందనలో ఫిర్యాదులను నమోదు చేయడానికి, ట్రాక్ చేయడానికి మరియు ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ సిస్టమ్ ప్రతిపాదించబడింది. CMO / SECY లు / HOD లు / జిల్లా కలెక్టరేట్లు / జిల్లా మరియు మండల స్థాయి కార్యాలయాలలో అర్జీలు స్వీకరిస్తారు.  ఈ వేదిక సరైన జవాబుదారీతనంతో అర్జీదారుని ఆధార్ సంఖ్యతో అనుసంధానించబడింది. 

(ఆధార్ తో నిమిషాల్లో పాన్ కార్డు.)

AP Anti-Corruption Call Centre :

ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. అతినీతి ఎక్కడ జరిగిన తెలిపేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టారు. AP Anti-Corruption Toll Free Number / Helpline Number -14400. ప్రభుత్వ కార్యాలయాల్లో, లేదు ప్రభుత్వ అధికారులు అతినీతికి పాల్పడితే వెంటనే ఈ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను దుర్వినియోగం చేయకూడదలని ప్రభుత్వం సూచిస్తుంది. ఏదైన పథకానికి సంబంధించి, లేదా ఏదైన సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఈ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 

Spandana Toll Free Number :  

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందనలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటుచేసింది. ప్రజాసమస్యల  పరిష్కార వేదిక – 1800-425-4440 (టోల్ ఫ్రీ) నెంబర్ కు ఎప్పుడైనా (24*7) కాల్ చేసి తమ అర్జీ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆన్ లైన్ గ్రీవెన్స్ పోర్టల్ లో ఎంటర్ చేసి, వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారికి పంపవచ్చు. మీ సమస్యను  స్పందనలో ఎంటర్ చేయాలని అనుకుంటే కింద ఇచ్చిన సమాచారాన్ని అందించాలి. 

(ఆధార్ లో అడ్రస్ సులువుగా ఎలా మార్చకోవాలి.)

  • కేటగిరి
  • తేదీ
  • నియమించబడిన అధికారి డిపార్ట్మెంట్
  • సమస్య స్థానం
  • అర్జీదారుడు
  • అర్జీదారుడు ఇచ్చిన స్టేట్మెంట్ 

Spandana Features :

  • CMO / HOD నుంచి మండల స్థాయి వరకు సాధారణ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫాం ఉంటుంది.
  • ఆధార్ లింక్డ్ ట్రాకింగ్ సిస్టమ్ నకిలీలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
  • అర్జీ లేదా కంప్లైంట్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయబడుతుంది. ప్రభుత్వ పరమైన అన్ని విభాగాలలో కంప్లైంట్లను పార్వర్డ్ లేదా ట్రాక్ చేసే సౌకర్యం ఉంటుంది.
  • CMO / HOD / జిల్లా స్థాయిలో ఫిర్యాదులన పరిష్కరించేందుకు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు. 
  • కాల్స్ కు ఆటోమెటిక్ రిప్లయి, SMS / మెయిల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల కోసం 100 శాతం క్వాలిటీ ఆడిట్ నియమించారు. 
  • ఆన్ లైన్ మరియు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదులు చేసేందుకు సౌకర్యం కల్పించారు. 

Address :

స్పందన – ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమస్యను ఆ శాఖకు పంపవచ్చు. స్పందన ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిరునామా..

RTGS (Real Time Governance Society),

Block- 1, AP secretariate,

Velagapudi, amaravathi.

E-mail : [email protected]

 

Main Address Location

Chief Minister Grievance redresal System(CMGRS),

Tadepally, Guntur, Andhra Pradesh.

Phone : 1100/1800-425-4440

E-mail : [email protected]

 

CLICK HERE : https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx

 

Leave a Comment