ఆధార్ కార్డులో అడ్రస్ సులువుగా మార్చుకోవడం ఎలా..!

ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక గుర్తింపును స్థాపించే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం తరపున ప్రత్యేక గుర్తింపు అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన వ్యక్తిగత గుర్తిపు సంఖ్య ఈ Aadhar. ఇది దేశంలో ఎక్కడైనా గుర్తింపు మరియు చిరునామాకు రుజువుగా ఉపయోగపడుతుంది. Aadhar అనేది ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థ. బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, ఇ-టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు మరియు గుర్తింపును స్థాపించాల్సిన అవసరం ఉన్న అనేక ఇతర ప్రదేశాలలో ఆధార్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. 

అయితే కొంత మందికి వారి ఆధార్ కార్డుల్లో అడ్రస్ తప్పుగా పడటం లేదా వారు ఇల్లు మారడం జరుగుతుంది. అలాంటి వారు వారి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకునేందుకు ఆధార్ సెంటర్ కు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఆ బాధలు ఇక నుంచి ఉండవు. ఆధార్ సంస్థ మీ ఆధార్ లో అడ్రస్ ను సులువుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. మీరు ఆధార్ సెంటర్ కు వెళ్ల కుండానే ఆన్ లైన్ లో మీ ఆధార్ కార్డు అడ్రస్ ను సులువుగా మార్చుకోవచ్చు. దాని కోసం మీరు కింది స్టెప్స్ ను ఫాలో కండి. 

How to Change address in Aadhar Online :

  • తర్వాత Update address మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

  • అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. కింద ఒక క్యాప్చ ఉంటుంది. దానిని ఎంటర్ చేసి Send OTP అనే బటన్ పై క్లిక్ చేయాలి. 

  • అప్పుడు మీ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి మీ ఆధార్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. 

  • ఆ తరువాత మీరు అడ్రస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ ను నొక్కాలి. 
  • అక్కడ మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లో పేర్కొన్న చిరునామాను ఎంటర్ చేసి Submit Update Request బటన్ పై క్లిక్ చేయాలి. 
  • ఒక వేేళ మీరు అడ్రస్ modify చేయాలి అనుకుంటే ‘modify’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక మీరు డిక్లరేష్ మీద టిక్ చేసి ‘proceed’ బటన్ పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత మీరు మీ అడ్రస్ ప్రూఫ్ కు  ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకుని, స్కాన్ చేసిన డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాలి. తర్వాత Submit బటన్ ను క్లిక్ చేయాలి. 

  •  ఆ తరువాత ‘yes’ బటన్ పై క్లిక్ చేసి, మీ వివరాలను ధ్రువీకరించే BPO సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకుని Submit బటన్ పై క్లిక్ చేయాలి. 
  • మీ ఫారంలో పేర్కొన్న వివరాలు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ తో సరిపోతే BPO సర్వీస్ ప్రొవైడర్ తనిఖీ చేస్తుంది. మీ అభ్యర్థనను UIDAI కి ఫార్వర్డ్ చేస్తుంది. మరియు మీ అభ్యర్థను స్వీకరించుకుని మీకు ఒక రసీదు స్లిప్ అందిస్తుంది. 
  • మీ అడ్రస్ నవీకరించిన తరువాత మీ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవ్చు. 

Leave a Comment