ఆధార్ ఉంటే 10 నిమిషాల్లో పాన్ కార్డు..

ఇకపై కొత్త పాన్ కార్డు పొందేందుకు ఎటువంటి దరఖాస్తు పారం నింపాల్సిన అవసరం లేదు. మరియు పాన్ కార్డు కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను విభాగం కొత్త సందుపాయాన్ని ప్రారంభించింది. ఆధార్ కార్డు ఉంటే చాలు ఆన్ లైన్ లో తక్షణమే పాన్ కార్డు పొందేలా వీలు కల్పిస్తుంది. అది కూడా ఉచితంగా పొందవచ్చు.

దీని కోసం తక్షణ ఈ-పాన్ కార్డు దరఖాస్తు ఫారంలో మీ ఆధార్ నెంబర్ ను మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మీ లింక్ చేసిన మొబైల్ ఫోన్ నెంబర్ లో ఓటీపీ పంపబడుతుంది. అంతే దరఖాస్తు దారునికి కేవలం 10 నిమిషాల్లో శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) తక్షణమే జారీ చేస్తారు. e-PAN Card భౌతిక కాపీ వలే మంచిదే అయినప్పటికీ, కేవలం రూ.50కు పునర్ ముద్రణను ఆర్డర్ చేయడం ద్వారా మీకు కావాలంటే లామినేటెడ్ పాన్ కార్డును పొందవచ్చు. 

ఆన్‌లైన్‌లో తక్షణ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేేసే విధానం..

1) ఈ-పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవడం కోసం ఆదాయపు పన్ను శాఖ యొక్క e-filling పోర్టల్ ను సందర్శించాలి. ఎడమ వైపున “Quick LInks’’ కింద ఉన్న ” Instant PAN through Aadhar” విభాగంలో క్లిక్ చేయండి.

2) తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘’Get New Pan’’ అనే అప్షన్ మీద క్లిక్ చేయండి.  

3) మీ ఆధార్-లింక్డ్ మొబైల్ ఫోన్‌లో OTP ను రూపొందించడానికి New PAN card మరియు క్యాప్చా కోడ్ కేటాయింపు కోసం మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

4) OTP ని నమోదు చేయాలి. 

5) ఆధార్ వివరాలను నిర్ధారించుకోవాలి.

6) పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం మీ ఇమెయిల్ ఐడిని ధృవీకరించడానికి మీకు ఆప్షన్ ఉంటుంది.

7) ఆ ఆధార్ నంబర్ యొక్క ఇ-కెవైసి డేటా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) తో మార్పిడి చేయబడుతుంది, ఆ తర్వాత మీకు తక్షణ e-PAN కేటాయించబడుతుంది. మొత్తం ప్రక్రియ 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

8) ” Check Status / Download Pan’’ వద్ద ఆధార్ నంబర్‌ను ఎంటర్ ద్వారా మీరు మీ PAN ను Pdf లో  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఇమెయిల్-ఐడి ఆధార్ డేటాబేస్ లో నమోదు చేయబడితే, మీరు మీ ఇమెయిల్ ద్వారా పాన్ ను  Pdf లో పొందుతారు.

క్రొత్త పాన్ కార్డు పొందే మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఉచితం, సులభం మరియు కాగిత రహితంగా చేయబడింది. మీరు పోర్టల్‌లో ఎటువంటి పత్రాలను అప్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు.

ఇంతకు మునుపు పాన్ కేటాయించని వారికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉందని గమనించండి. మొబైల్ ఫోన్ నంబర్ ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడి ఉంది మరియు DD-MM-YYYY ఫార్మాట్‌లో పూర్తి పుట్టిన తేదీ ఆధార్ కార్డులో లభిస్తుంది. అంతేకాకుండా, మైనర్లకు తక్షణ ఇ-పాన్ కార్డ్ సౌకర్యం అందుబాటులో లేదు.

 

CLICK HERE 

Leave a Comment