ఇంటర్నెట్ వాడకంలో ఆడవాళ్లే టాప్..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది.. ఒక్క మొబైల్ ఉంటేనే సరిపోదు కదా.. అందులో ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి.. నిద్ర లేచినప్పటి నుంచి ఇంటర్నెట్ లేని మనిషి జీవితాన్ని అస్సలు ఊహించలేం.. ఇంటర్నెట్ వాడకం గురించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(2019-21)
ఆసక్తికర విషయాలు వెల్లడించింది..

ఇంటర్నెట్ వాడకంలో పురుషల కంటే మహిళలే ముందువరుసలో ఉన్నారని తేలింది. దేశవ్యాప్తంగా మహిళల్లో 66.7 శాతం మంది ఇంటర్నెట్ వాడుతుంటే.. 33.3 శాతం మంది విముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక పురుషుల్లో 48.8 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నట్లు తెలిపింది. 

తెలంగాణలో కేవలం 50 శాతం మంది పురుషులు ఇంటర్నెట్ వాడుతుంటే.. 73.5 శాతం మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారట.. ఇక ఇంటర్నెట్ వినియోగంలో బీహార్ రాష్ట్రం దేశంలోనే టాప్ లో ఉంది. అక్కడ పురుషుల్లో 64.6 శాతం మంది, మహిళల్లో 79.4 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 

సాధారణంగా ఆడవాళ్లకు టీవీ పిచ్చి ఎక్కువ అంటారు. కానీ టీవీ చూడటంతో పురుషులే ఎక్కువ ఉన్నారట.. కనీసం వారానికి ఒకసారి టీవీ చూసేవారి సగటు దేశవ్యాప్తంగా మహిళల్లో 53.5 శాతం ఉండగా, పురుషుల్లో 55.9 శాతం ఉంది. దేశంలో టీవీ చూడటంతో గోవా టాప్ లో ఉంది. అక్కడ 95.5 శాతం మంది పురుషులు, 85 శాతం మంది మహిళలు టీవీ చూస్తున్నారు. అత్యల్పంగా మేఘాలయలో 30.4 శాతం పురుషులు, అస్సాంలో 35.9 శాతం మహిళలు టీవీ చూస్తున్నారు. 

దేశవ్యాప్తంగా 5.9 శాతం మంది కనీసం వారినికి ఒకసారి రేడియో వింటామని చెప్పారు. వారానికి ఒక వార్తాపత్రికనో మ్యాగజైనో చదివేవారి సగటు 23.35 శాతం మాత్రమే ఉంది. పేపర్ చదవడంలో కేరళ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానాల్లో ఉన్నాయి.   

Leave a Comment