పెన్సిళ్లపై మహాభారతం లఖించిన మహిళ..!

కళలలో సూక్ష్మ కళ ఒకటి.. ఎంతో మంది కళాకారులు రకరకాలుగా సూక్ష్మ కళలను ప్రదర్శిస్తుంటారు. ఇది ఎంతో కష్టమైన కళ.. చాలా సూక్ష్మమైన వస్తువులపై కళాఖండాలను చెక్కాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. దీంతోపాటు ఓర్పు, సహనం కూడా అవసరం.. అప్పుడే అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దగలరు. 

అలాగే తన ప్రతిభతో పెన్సిళ్లపై మహాభారతాన్ని లిఖించింది ఓ మహిళ.. మహాభారతంలోని 18 పర్వాలను, 700 శ్లోకాలను సంస్కృత భాషలో లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత.. 810 పెన్సిళ్లపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లఖించింది. 

అలా లిఖించడం కోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకోవడమే తన లక్ష్యమని మహిత చెబుతోంది.. మహిత గతంలోనూ బియ్యపు గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన వినాయకుడు వంటి ఆకృతులను చెక్కింది.  

Leave a Comment