బిలియనీర్స్ బ్రాండెడ్ బట్టలు ధరించరు.. ఎందుకో తెలుసా?

బాగా డబ్బులు ఉంటే చాలు విలాసవంతమైన జీవితం గడపొచ్చని, బ్రాండెడ్ దుస్తులు వేసుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే తమ వద్ద డబ్బులు ఉన్నాయని డ్రెస్సింగ్ స్టయిల్ తోనే చెప్పొచ్చు.. కానీ చాలా మంది బిలియనీర్లు మాత్రం సాదాసీదాగా ఉంటారు. ముఖ్యంగా వారీ వేసుకునే దస్తులు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. 

ఏంటీ వీళ్లకు ఇంత డబ్బులు ఉండీ సాదాసీదా బట్టలు వేసుకున్నారేంటని సందేహం కలుగుతుంది. ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఇలాంటి ప్రశ్నే ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూప్స్ చైర్మన్ హర్ష్ గోయెంకాకు వచ్చందట. వెంటనే ఓ బిలియనీర్ ఈ ప్రశ్న అడిగారట. ఈ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. 

‘ఉతికి పారేసే బట్టల మీద ఎక్కువగా డబ్బులు వెచ్చిండం వేస్ట్.. ఎంత ఖరీదైన బట్టలైనా కొంత కాలానికి పాడైపోతాయి. బట్టల మీద పెట్టే డబ్బులను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం బెటర్. నేను ఎలాంటి వాడిని, నా విలువ ఏంటనేది నా పని నిర్ణయిస్తుంది. బ్రండెడ్ బట్టలు కాదు’ అంటూ ఆ బిలియనీర్ సమాధానం చెప్పాడట.

 

Leave a Comment