ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు.. ఎన్టీఆర్ ఏంచేశారో తెలుసా?

పీఆర్సీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఏపీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అంతే కాదు సమ్మెకి దిగాలని కూడా ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.. అయితే గతంలోనూ దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు సమ్మె చేశారు.. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారు.. ఏం నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..  

ఎన్టీఆర్ హయాంలో ఏం జరిగింది?

1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చనప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. యువతకు ఉపాధి అవకాశఆలు పెరుగాయని ఆ ఏడాది ఫిబ్రవరి 8న జీవో తీసుకొచ్చారు. దీంతో ఆ ఏడాది జూలైలో ఉద్యోగులు సమ్మెకి దిగారు. అయితే నాటి ప్రభుత్వ సీఎస్ జీవీ రామక్రిష్ణ జోక్యంతో 19 రోజుల తర్వాత ఉద్యోగులు సమ్మె ముగించారు.. 

1986 జూలైలో పీఆర్సీ అమలు చేసినప్పుడు ఉద్యోగుల డిమాండ్లను ఎన్టీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదు. కొత్త పీఆర్సీని జులై నుంచి కాకుండా జనవరి నుంచి అమలు చేయాలని, ‘మినిమం బేసిక్ పే’ని పెంచాలని, ఐఆర్ ని బేసిక్ పేలో కలపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.. కానీ వీరి డిమాండ్లకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ప్రభుత్వ ఆదాయంలో 48 శాతం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతుందని, ఇక పెంచే అవకాశం లేదని ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. 

దీంతో 1986 నవంబర్ నెలలో ఉద్యోగులు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన కొన్ని రోజుల వరకు ఉద్యోగుల సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు చేసింది. అయితే చర్చలు జరిపేందుకు ఉద్యోగ సంఘాలు ఒప్పుకోలేదు. తర్వాత ఉద్యమ నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు రాస్తా రోకోలు, రాష్ట్ర బంద్ లు నిర్వహించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని ఎన్టీఆర్ హెచ్చరించారు. అయినా ఉద్యోగులు తగ్గలేదు.. ఇక వివాదం ముదురుతున్న దశలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జోక్యం చేసుకుని ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య రాజీ కుదిరించింది. దీంతో 53 రోజుల సమ్మెకు తెరపడింది. అయితే ఉద్యోగుల డిమాండ్లు మాత్రం నెరవేరలేదు..  

Leave a Comment