స్మార్ట్ ఫోన్ కి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు..!

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన మహేశ్(19) అనే యువకుడు స్మార్ట్ ఫోన్ కి బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. ఇంటర్ మధ్యలోనే మానేసి కూలీ పనులకు వెళ్తున్న మహేశ్ ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాడు.. సెల్ ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి అతడి జీవితమే మారిపోయింది. ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేకపోయాడు. స్మార్ట్ ఫోన్ లో పబ్జీ తరహా గేమ్స్ కి బానిస అయ్యాడు.

అప్పటి నుంచి పనులు మానేసి ఇంట్లోనే రాత్రి పగలు తేడా లేకుండా.. మూడు నెలలుగా నిద్రహారాలు మాని స్మార్ట్ ఫోన్ లోనే మునిగిపోయాడు. దీంతో మహేశ్ ఆరోగ్యం క్షీణించింది. తాను ఏం మాట్లాడుతున్నాడో.. ఎదుటివారు ఏం అడుగుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితికి చేరాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

మహేశ్ కి దెయ్యం పట్టిందని భావించి మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. మంత్రాలు వేయించారు. తాయెత్తులు కట్టించారు. అయినా మహేశ్ లో మార్పు రాలేదు. దీంతో కణేకల్లులోని ఓ ప్రైవేట్ ల్యాబ్ కి తీసుకెళ్లారు. అక్కడ పనిచేసే టెక్నీషియన్ తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించాడు. చివరికి అతడి మానసిక స్థితి దెబ్బతిందని, వైద్యుడిని కలవాలని చెప్పాడు. అతడి మానసిక స్థితికి కారణం స్మార్ట్ ఫోన్ అని తెలుసుకున్నారు..   

 

Leave a Comment