మత ప్రార్థనల పేరుతో పాడుపనులు..విశాఖలో నకిలీ పాస్టర్ ఆకృత్యాలు..!

మత ప్రార్థనల పేరుతో ఓ పాస్టర్ మహిళలపై ఆకృత్యాలకు పాల్పడ్డాడు.. ప్రార్థనా మందిరంలో ఉన్న మహిళలను హింసించడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేశాడు.. క్రైస్తవం ముసుగులో నకిలీ పాస్టర్ దురాగతం ఆంధ్రప్రదేశ్ లో బయటపడింది.. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురంకు చెందిన అనిల్ కుమార్ అలియాస్ ప్రేమదాస్ తమ సంస్థ పేరుతో ఓ ఆశ్రమం నడుపుతున్నాడు. 

రైల్వేశాఖలో టీటీఈ ఉద్యోగం వదిలి మోసపు మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్, ఫౌండర్, డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుడు అనే పేరులో యూ ట్యూబ్ ఛానల్ ద్వారా బోధనలు చేస్తున్నాడు. ఆన్ లైన్ ప్రార్థనల పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. తాను మాట్లాడే ప్రతి మాట దేవుడే చెబుతున్నాడంటూ నమ్మబలికాడు.. ప్రార్థనల ద్వారా మీ కష్టాలు తొలగిస్తానంటూ ప్రచారం చేశాడు. అలా కష్టాలు చెప్పుకున్న వారి నుంచి లక్షల రూపాయలు తీసుకునేవాడు.. 30 మందికిపైగా మహిళలు ప్రేమదాస్ మాయలో పడ్డారు..

రెండేళ్ల క్రితం శ్రీరాంపురంలో స్థలాన్ని కొనుగోలు చేసి రూ.2 కోట్లు విలువైన భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో మహిళలను బంధించి వేధించేవాడు. అతని మాటలు నమ్మి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతి మోసపోయింది. మూడేళ్ల క్రితం ఆమె ఉద్యోగాన్ని వదిలి శ్రీరాంపురం వచ్చేసింది. చివరికి అతడి వేధింపులు భరించలేక ఆమె గురువారం పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించింది. రైల్వేలో అతడితో పాటు పనిచేసిన ఓ స్నేహితుడు కూడా కుటుంబాన్ని వదిలి ప్రేమదాస్ తోనే ఉండిపోయాడు.. ప్రేమదాస్ మాయలో పడి జమ్మలమడుగుకు చెందిన ఓ మహిళ తన భర్తకు తెలియకుండా రూ.11 లక్షలు ఇచ్చిందని తెలిసింది.. 

యువతి ఫిర్యాదు మేరకు ప్రేమదాస్, మరో నలుగురిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. అతడి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉంటున్న యువతులతో మాట్లాడారు. ప్రార్థనల పేరిట జరుగుతున్న మోసాలు, వేధింపులపై ఆరా తీశారు. అనిల్ కుమార్ తన సొంత పేరుతో కాకుండా సంతోష్ అనే వ్యక్తి పేరుతో అకౌంట్ తెరిచి లావాదేవీలు నిర్వహించేవాడని పోలీసులు గుర్తించారు. జగ్గంపేట పరిసర ప్రాంతాలకు చెందిన 8 మందిని పోలీసులు పంపించారు. మితిగా వారిని ఇళ్లకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.   

Leave a Comment