ఆమె చదువు కోసం ఊరే కదిలింది..!

దేశంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా మధ్యలోనే చదువు మానేసే వారు చాలా మంది ఉన్నారు. పదో తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన ప్రియాన్షు కుమారి పరిస్థితి కూడా అదే.. ఉన్నత చదువులు చదవడానికి ఆమె వద్ద డబ్బులు లేవు. ఈ తరుణంలో ఆమె చదువు ముందుకు సాగడానికి ఊరే కదిలి వచ్చింది. 

బీహార్ లోని జెహనాబాద్ ప్రియాన్షు కుమారి చిన్నప్పుడే తండ్రి కౌశలేంద్ర శర్మను కోల్పోయింది. ఆ వెంటనే ఆమె తాత కూడా మరణించారు. అప్పటి నుంచి నానమ్మ, అమ్మ కూలి పనులు చేసుకుంటూ ప్రియాన్షు, ఆమె సోదరి పోషణను చూసుకుంటూ వస్తున్నారు. వచ్చిన డబ్బులతో వారిని చదివించుకుంటున్నారు.. 

ఈక్రమంలో ప్రియాన్షు కుమారి ఈ ఏడాది బీహార్ బోర్డు పరీక్షల్లో 472 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. అయితే పై చదువులు చదివించేందుకకు వారి వద్ద డబ్బుల్లేవు. ఈ విషయం తెలిసి ఊరి మాజీ సర్పంచ్, రిటైర్డ్ సైనికుడు సంతోష్ కుమార్ సహాయం చేశారు. ఆమె పై చదువుల కోసం కొంత డబ్బులు ఇచ్చారు. 

ఈ విషయం ఊరంతా తెలిసింది.. అంతే.. ప్రియాన్షు చదువు కోసం ఊరంతా కదిలి వచ్చింది. బోర్డ్ ఎగ్జామ్స్ లో స్టేట్ ఫస్ట్ నిలిచి.. సుమేరా గ్రామం పేరును హెడ్ లైన్స్ లో నిలిపిన ప్రియాన్షు చదువు ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. ఆమె చదువు కోసం ఆర్థిక సాయం అందించింది. ప్రియాన్షు లక్ష్యమైన సివిల్స్ కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆ గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు ప్రజాప్రతిధులు, అధికారులు ఎవరైనా సాయం చేస్తామని వస్తే వద్దంటున్నారు ఆ గ్రామస్తులు.. తమ ఊరి బిడ్డను తామే చదివించుకుంటామనా అంటున్నారు…    

Leave a Comment