హర్భజన్ సింగ్ గొప్ప నిర్ణయం.. రాజ్యసభ జీతం రైతుల కుమార్తెల చదువుల కోసం..! 

మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని రైతుల కుమార్తెల చదువుల కోసం అందిస్తానని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా హర్భజన్ సింగ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం అందించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు తనకు చేతనైనంత చేస్తానని హర్భజన్ ట్వీట్లర్ లో పేర్కొన్నారు. 

గతేడాది డిసెంబర్ లో క్రికెట్ కి వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. గత నెల పంజాబ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హర్భజన్.. ఇదిలా ఉంటే.. పంజాబ్ ప్రజలకు ఆప్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి ప్రంజాబ్ లోని ప్రతి ఇంటికీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్లు ప్రకటించింది.  

 

Leave a Comment