ఫ్రెండ్స్ సలహాతో వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్త పెళ్లికొడుకు.. ఆ తర్వాత ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితికి..!

ఉత్తరప్రదేశ్‌లో ఓ నూతన వరుడు స్నేహితులు చెప్పారని వయాగ్రాను అధిక మోతాదులో తీసుకున్నాడు. దీంతో ఆ యువకుడికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. చివరికి ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ 28 ఏళ్ల యువకుడికి మూడు నెలల క్రితం వివాహం అయ్యింది. అయితే అతడి స్నేహితులు అతని పౌరుషాన్ని సవాలు చేసి, లైంగిక శక్తిని పెంచడాినికి వయాగ్రా తీసుకోవాలని సలహా ఇచ్చారు. 

దీంతో ఆ యువకుడు వయాగ్రా తీసుకోవడం మొదలు పెట్టాడు. స్నేహితుల సలహా మేరకు ఆ యువకుడు 25-30 మి.గ్రా వయాగ్రా తీసుకోవడం మొదలుపెట్టాడు.కానీ తనకు సంతృప్తి లభించడం లేదు. దీంతో ఫ్రెండ్స్ డోస్ పెంచాలని సలహా ఇవ్వడంతో.. ఆ యువకుడు 200 ఎంజీ వయాగ్రా తీసుకున్నాడు. 

దీంతో ఆ యువకుడు ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య వచ్చి పడింది. ఓవర్ డోసుగా తీసుకోవడంతో ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ సరిగా ఫంక్షన్ చేయలేదు. సుమారు 20 రోజుల పాటు ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ ఎరెక్ట్ అయ్యే ఉన్నాయి. ఈ ఘటనలు అన్నీ వధువును కలత పెట్టాయి. మానసికంగా ఇబ్బంది పడింది. దీంతో ఆమె తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో వరుడి కుటుంబమే ఆమెను సర్ది చెప్పి వెనక్కి తెచ్చారు. కానీ, ఆ వరుడు హాస్పిటల్‌లో అడ్మిట్ కాగానే ఆమె తిరిగి వెళ్లిపోయింది.

ఆ యువకుడికి డాక్టర్లు పెనైల్ ప్రొస్థెసిస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆ యువకుడికి ఈ సమస్య జీవిత కాలం వెంటాడుతుందని వైద్యులు తెలిపారు. ఆ యువకుడు పిల్లలను కనడానికి యోగ్యుడిగానే ఉంటాడని, కానీ, ఆయన ప్రైవేట్ పార్ట్‌లో టెన్షన్ ఇప్పట్లో చల్లబడదని వివరించారు. ఆయన జీవితాంతం టైట్ క్లాత్స్ ధరించి తన ప్రైవేట్ పార్ట్‌ను కవర్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 

 

Leave a Comment