తన మూత్రాన్ని తానే తాగుతున్న యువకుడు..!

ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. మన ఇండియాలో ఆవు యూరిన్ తాగే వారు చాలా మంది ఉన్నారు. ఆవు మూత్రంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు నమ్ముతారు.. కానీ ఇంగ్లండ్ కి చెందిన ఓ యువకుడు మాత్రం ప్రతిరోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు..దీనిని తాగడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తున్నట్లు ఆ యువకుడు చెబుతున్నాడు.. 

ఇంగ్లండ్ కి చెందిన 34 ఏళ్ల హారీ మెటాడీన్ ఒకప్పుడు డిప్రెషన్ తో తెలియని ఆందోళనతో బాధపడేవాడు.. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఈ యువకుడు ‘యూనిర్ థెరపీ’ని మొదలుపెట్టాడు. తన యూరిన్ తాగుతున్నప్పటి నుంచి వాటి నుంచి బయటపడ్డాట.. అంతేకాదు.. ప్రస్తుతం తనకు 34 ఏళ్లు ఉన్నప్పటికీ పదేళ్లు చిన్నవాడిలా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. 

ప్రతిరోజూ 200 మి.లీ తన మూత్రాన్ని తాగుతానని మెటాడీన్ తెలిపాడు. నెల రోజుల పాటు నిల్వ చేసిన మూత్రాన్ని తాజా మూత్రంతో కలిపి తీసుకుంటానని చెప్పాడు. దాని వాసన, రుచి అంటే తనకు ఇష్టమని, కొన్నిసార్లు ఆ యూరిన్ తోనే తన ముఖం కడుక్కుంటానని అంటున్నాడు. మాయిశ్చరైజర్ లా తన ముఖానికి అప్లయి చేసుకుంటానని, దీని వల్ల తన ముఖం మరింత కాంతివంతంగా మారిందని, నిత్య యవ్వనానికి ఇదొక సీక్రెట్ అని చెబుతున్నాడు. 

మెటాడీన్ యూనిర్ థెరపీని 2016లో మొదలు పెట్టాడు. ఈ అలవాటు అతన్ని కుటుంబ సభ్యులకు దూరం చేసింది. ఇది నచ్చక అతని సోదరి కూడా తనను దూరం పెట్టినట్లు చెప్పాడు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ థెరపీ మంచిది కాదని అంటున్నారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుందని, బ్యాక్టీరియా బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   

 

Leave a Comment