కిండర్ జాయ్ చాక్లెట్ తిని చిన్నారులకు అస్వస్థత..!

కిండర్ జాయ్.. ఈ పేరు వింటేనే పిల్లలకు నోరూరుతుంది. పిల్లలు ఈ చాక్లెట్ ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో చాక్లెట్ తో పాటు ఆట వస్తువు కూడా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈ చాక్లెట్ ని ఎక్కువగా కొనిస్తుంటారు. అయితే తాజాగా జరిగిన ఘటన తల్లితండ్రులను కలవరపెడుతోంది.. 

బెల్జియంలో ఈ కిండర్ జాయ్ చాక్లెట్లు తిని 151 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మరికొంత మంది పిల్లలు వాంతులు, అతిసారంతో బాధపడుతున్నారు. వీరిని ఆస్పత్రికి తరలించిక చికిత్స అందిస్తున్నారు. యూరప్ లోనూ ఇదే విధంగా అస్వస్థతకు గురయ్యారు.. ఈ చాక్లెట్ లో సాల్మొనెల్లా టైఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ కనుగొంది.. 

ఈ బ్యాక్టీరియా అధికంగా ఉన్న పదార్థాలతో తయారైన కిండర్ తినడం వల్ల అస్వస్థత కలుగుతుందని సంస్థ తెలిపింది. ఆరు రకాల యాంటీబయాటిక్ లకు నిరోధకతను కలిగి ఉన్న సాల్మొనెల్లా జాతి బ్యాక్టీరియా చాలా డేంజర్ అని పేర్కొంది. అయితే అస్వస్థతకు గురైన వారిలో ఎవరూ చనిపోలేదు. ఇప్పటికే బిల్జియంలో ఉన్న కిండర్ జాయ్ తయారీ ఫ్యాక్టరీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

Leave a Comment