‘RSS’కి పోటీగా కొత్తగా ‘తిరంగ శాఖ’..!

దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక హిందూ జాతీయవాద సంస్థ అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి పోటీగా కొత్త శాఖ రాబోతోంది.. దేశంలో బీజేపీ విద్వేష పూరిత రాజకీయాలకు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ‘తిరంగ శాఖ’లు ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్ లో ఈ తిరంగ శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు ఆప్ ఎంపీ, యూపీ ఇన్ చార్జి సంజయ్ సింగ్ శనివారం తెలిపారు. 

ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ఈ శాఖలు పనిచేస్తాయని, వచ్చే ఆరు నెలల్లో పది వేల తిరంగ శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆప్ ఎంపీ చెప్పారు. బీజేపీ అమలు చేస్తున్న ‘విభజించు-పాలించు’ విధానంపై ఉత్తరప్రదేశ్, దేశ ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ తిరంగ శాఖలు పనిచేస్తాయని సంజయ్ సింగ్ వెల్లడించారు. 

జూలై ఒకటో తేదీ నుంచి పదివేల శాఖలకు ప్రముఖ్ లను నియమిస్తుందని సంజయ్ సింగ్ అన్నారు. తిరంగ శాఖలను ఏర్పాటు చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తామని, రాజ్యాంగ పీఠికను చదివి వినిపిస్తామని చెప్పారు. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలను అమలు చేస్తోందని, ఇది దేశాన్ని, రాజ్యాంగాన్ని బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా భారత్ తన గుర్తింపును కోల్పోతుందని సంజయ్ సింగ్ తెలిపారు. 

 

 

Leave a Comment