చరిత్రలో ఇదే తొలిసారి..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందకంటే ప్రతి ఏడాది ఎంత వైభవంగా నిర్వహిస్తారో అందరికీ తెలుసు. ఈ బ్రహ్మోత్సవాలను లక్షల మంది భక్తులు వీక్షిస్తారు.  కాగా, ఈనెల 19 నుంచి 27 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది చరిత్రలో ఎన్నడు లేని విధంగా భక్తులు లేకుండానే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 

కురోనాను అరికట్టే చర్యల్లో భాగంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈనెల 18న అంకురార్పణ నిర్వహించనున్నారు. రంగనాయకుల మండపంలో స్థలభావం కారణంగా వాహన సేవలను ఆలయంలోనే కళ్యాణోత్సవం మండపంలోనే నిర్వహించనున్నారు. స్వర్ణ రథం, రథోత్సవం స్థానంలో సర్వభూాల వాహనాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 

శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

సెప్టెంబర్ 19 – ధ్వజారోహణం(ఉదయం), పెద్దశేష వాహనం(రాత్రి)

సెప్టెంబర్ 20 – చిన్న శేష వాహనం (ఉదయం), హంస వాహనం(రాత్రి)

సెప్టెంబర్ 21 సింహ వాహనం(ఉదయం), ముత్యపు పందిరి వాహనం(రాత్రి)

సెప్టెంబర్ 22 – కల్ప వృక్ష వామనం(ఉదయం), సర్వభూపాల వాహనం(రాత్రి)

సెప్టెంబర్ 23 – మోహినీ అవతారం(ఉదయం), గరుడ వాహనం(రాత్రి)

సెప్టెంబర్ 24 – హనుమంత వాహనం(ఉ), గజవాహనం, సర్వభూపాల వాహనం(రా)

సెప్టెంబర్ 25 – సూర్యభూపాల వాహనం(ఉ), చంద్రప్రభ వామనం(రా)

సెప్టెంబర్ 26- సర్వభూపాల వామనం(ఉ), అశ్వవాహనం(రా)

సెప్టెంబర్ 27 – చక్రవాహనం(ఉ), ధ్వజారోహణం(రా)

కాగా, కరోనా వైరస్ కారణంగా 24, స్వర్ణ రథం, 26న రథోత్సవం ఉండదు. ఆ రెండు రోజుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఉభయదేవేరులతో దర్శనం ఇవ్వనున్నారు. 

Leave a Comment