భారత వాయుసేనలోకి చేరిన రఫెల్..!

భారత వాయుసేనలోకి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హర్యానాాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి ఈ రఫెల్ విమానాలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. రఫెల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి అధికారికంగా వచ్చి చేరాయి. వీటి రాకతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. 

భారత వాయుసేనలో 17వ స్క్యాడ్రన్ గా రఫెల్ విమానాలు చేరాయి. ఇవి 17 స్క్యాడ్రన్ గోల్డెన్ ఆరోస్ ద్వారా సేవలను అందజేయునున్నాయి. తొలిదశలో జూలై 29న ఐదు రఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్నాయి. 36 రఫెల్స్ కోసం 59 వేల కోట్ల ఒప్పందం కుదిరింది. వచ్చే నెలలో మరో నాలుగు యుద్ధ విమానాలు భారత్ కు రానున్నాయి. కాగా, అంబాలా ఎయిర్స్ ఫోర్స్ స్టేషన్ లో గురువారం ఐదు రఫెల్ యుద్ధ విమానాల ఇండక్షన్ సెర్మనీ జరిగింది. ముందుగా సర్వధర్మ పూజ నిర్వహించారు. సర్వ మతాలకు చెందిన పెద్దలు పూజలు చేశారు. 

  

Leave a Comment