కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసా?

కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయా? అయితే ఈ టెక్నిక్స్ వాడితే కరెంట్ బిల్లలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా విద్యుత్ వాడకం పెరిగి, యూనిట్లు పెరిగితే శ్లాబు మారుతుంది. ఒక్కసారి శ్లాబు మారిందంటే కరెంట్ బిల్లు డబుల్ అవుతుంది. అయితే విద్యుత్ వినియోగం తగ్గించుకోవడం ద్వారా బిల్లు తగ్గించుకునే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

కరెంట్ బిల్లు తగ్గించేందుకు టెక్నిక్స్:

  • అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేయకండి. ఇంట్లో చిన్న వాళ్లకు ఈ విషయం గురించి వివరించండి. ఏదైన పనిచేస్తున్నప్పుడు దానికి సరిపోయే లైట్లను మాత్రమే వినియోగించాలి. 
  • ఆర్డినరీ బల్బులకు బదులుగా తక్కువ విద్యుత్ వినియోగంతో కూడిన వాటిని వాడితే 60 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.    
  • ఇంట్లో గీజర్ ఉంటే ఒక్కొక్కసారి ఆన్ చేయకుండా.. ఒకేసారి వేడి చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత మరొకరు స్నానాలు చేస్తే మంచిది. థర్మోస్టాట్ 50-60 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులు ఉంటే ఒకటే గీజర్ నీటిని వాడేలా పైపులు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే బిల్లు తగ్గించుకోవచ్చు. 
  • ఏసీని ఎప్పుడు 25 డిగ్రీల్లో ఉండేలా జాగ్రత్త పడాలి. దీని వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. వినియోగంలో లేని సమయంలో టీవీ, కంప్యూటర్ ఆఫ్ చేయాలి. దీని కారణంగా 40 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. 
  • ఇంట్లో ఉపయోగించే ఫ్రిజ్ పాతది అయితే నెలకు 160 యూనిట్లకు పైగా కరెంట్ కాలుతుంది. అదే స్మార్ట్ ఫ్రిజ్ అయితే అవసరమైనప్పుడే ఆన్ అవుతాయి. లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. 
  • వాషింగ్ మెషీన్ లో ఎప్పుడూ లోడ్ కు తగ్గట్టుగానే దుస్తులు వేయాలి. లోడ్ కు మించి వేయకూడదు. అలాగని ట్రిప్పుకో జత బట్టలను ఉతకకూడదు. ఇలా చేస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మెషీన్ పని విధానాన్ని కనీసం మూడు నెలలకు ఒకసారైనా చెక్ చేయించాలి. 

Leave a Comment