డాక్టర్ కావాల్సిన అమ్మాయి.. టీ అమ్ముతోంది.. 2 సార్లు ఫ్రీ సీటు వచ్చినా.. పేదరికంతో..!

డాక్టర్ కావాలన్న కల బైపీపీ చదివిన వారిలో చాలా మందికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొందిరికే దక్కుతుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ సీటు కొట్టడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితేకాని సీటు రాదు.. కానీ ఈ అమ్మాయికి మాత్రం ఎంబీబీఎస్ సీటు ఒక్కసారి కాదు.. రెండు సార్లు వచ్చింది. కానీ పేదరికం డాక్టర్ కాకుండా ఆమెకు అడ్డం పడుతోంది. సెటస్కోప్ పట్టాల్సిన చేతులు.. ఇప్పుడు టీ అమ్ముతున్నాయి.. నాడీ పట్టీ రోగాలు నయం చేయాల్సిన ఆమె దుకాణంలో సరకులు అమ్మతోంది..

ఆమె పేరు గోపిక.. మహిబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీలో ఉంటుంది. తండ్రి నర్సింహ కాలనీలోనే టీస్టాల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గోపిక టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించింది. ఇంటర్ తర్వాత నీట్ కు ప్రిపేర్ అయ్యింది. నీట్ పరీక్షలో ఆమెకు మంచి ర్యాంక్ వచ్చింది. ఆమెకు ఫ్రీగా సీటు లభించే అవకాశం కూడా ఉంది.. కానీ ఆర్థిక ఇబ్బందులో అడ్మిషన్ తీసుకోలేకపోయింది. 

అయితే ఏమాత్రం నిరాశ పడకుండా ఈ ఏడాది కూడా నీట్ పరీక్ష రాసింది గోపిక.. ఈసారి నీట్ లో 720 మార్కులకు 613 మార్కులతో 13,506 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది. ఆమెకు గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలలో ఫ్రీగా సీటు లభించే అవకాశం ఉంది. గవర్నమెంట్ సీటే అయినా అడ్మిషన్ ఫీజు, ఇతర ఖర్చులకు కలిపి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ మొత్తాన్ని కూడా భరించలేని స్థితిలో ఆమె కుటుంబం ఉంది. దీంతో ఈసారి కూడా డాక్టర్ కల నెరవేరదనే బాధ ఆ నిరుపేద విద్యార్థిని బాధిస్తోంది. తమ కూతురును డాక్టర్ ని చేయాలన్న కోరిక.. కలగానే మిగిలిపోకూడదని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నారు.. 

   

Leave a Comment