ఓరి నీ దుంపతెగ.. దొంగతనం కోసం.. 3 నెలల్లో 10 కేజీలు తగ్గావా…!

ఎవరైనా బరువు ఎందుకు తగ్గుతారు.. ఆరోగ్యం, ఫిట్ నెస్ కోసం బరువు తగ్గుతారు..కానీ ఈ వ్యక్తి మాత్రం దొంగతనం చేసేందుకు బరువు తగ్గాడు.. అవును .. నిజమేనండి.. మూడు నెలల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. అందుకోసం కఠినమైట్ డైట్ ని ఫాలో అయ్యాడు. ఇతడి బ్యాడ్ లక్ ఏటంటే.. దొంగతనం అనంతరం పోలీసులకు దొరికిపోయాడు..

గుజరాత్ కి చెందిన మోతీ సింగ్ చౌహాన్(34) రెండేళ్ల క్రితం భోపాల్ లోని బసంత్ బహార్ సొసైటీలో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో పనిచేసేవాడు.. మరాడియా ఇంట్లో విలువైన వస్తువులు ఉండేవి.. అయితే ఆ వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయి.. సీసీ కెమెరాలు ఎక్కడ అమర్చారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాడు మోతీ సింగ్..

ఆ ఇంటికి ఎలక్ట్రికల్ తలుపులు ఉన్నాయి. దీంతో ఆ తలుపులను పగటగొట్టడం సాధ్యం కాదు. కిటికీ ద్వారా మాత్రమే ఇంట్లో ప్రవేశించాలి.. అందు కోసం పెద్ద ప్లాన్ వేశాడు.. కిటికీ గుండా ప్రవేశించేందుకు తన శరీర బరువును తగ్గించుకున్నాడు. బరువు తగ్గేందుకు మూడు నెలల పాటు ఒక్క పూట మాత్రమే భోజనం చేశాడు. 

ఇక పక్కా ప్లాన్ ప్రకారం మరాడియా ఇంట్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా విలువైన వస్తువులను దొంగతనం చేశాడు. ఆ వస్తువులను ఓ హార్డ్ వేర్ షాపులో రూ.37 లక్షలకు అమ్మాడు. దీంతో మరాడియా ఇంటి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోతీ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఈక్రమంలో హార్డ్ వేర్ షాప్ బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. మోతీ సింగ్ అని నిర్ధారించుకున్న పోలీసులు అతడి సెల్ ఫోన్ ని ట్రేస్ చేశారు. చివరికి మోతీ తన స్వస్థలమైన ఉదయ్ పూర్ కు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మోతీ వద్ద చోరీకి గురైన నగదు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Leave a Comment