స్మార్ట్ గా వ్యసాయం చేస్తున్న ఇద్దరు యువకులు..!

మనిషి కష్టాన్ని నమ్ముకుని ఇంత వరకు వచ్చాడు. కానీ ప్రస్తుతం కాలం మారింది. మనిషి కష్టం మరిచి స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు. టెక్నాలజీ మనిషి జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొస్తోంది.. ఒకప్పుడు రైతు ఒళ్లు గుల్ల చేసుకుని పంట పండించేవాడు. కానీ ప్రస్తుతం రైతు సైతం టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ గా వ్యవసాయం చేస్తున్నాడు.. 

అలా ఇద్దరు యువకులు స్మార్ట్ గా వ్యసాయం చేస్తున్నారు. అంతేకాదు.. స్మార్ట్ టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలనే దాని గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సంతోష్ జాదవ్, ఆకాష్ జాదవ్ అనే ఇద్దరు యువకులు కలిసి ‘Indian Farmer’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.. 

ఈ ఛానెల్ ద్వారా రైతులకు వ్యవసాయంలో స్మార్ట్ టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయం, నీటి పారుదల, కలుపు మొక్కల నియంత్రణ, పురుగుమందుల వాడకం, ఎరువులు వాడే సరైన విధానం, నాణ్యమైన విత్తనాల సేకరణ, పంటల మార్పిడి, మార్కెట్ కి సరైన సమయం ఇలా అనేక అంశాల గురించి రైతులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే స్మార్ట్ క్రాప్ మానిటరింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దానిని వివరిస్తున్నారు. 

ఇద్దరు స్నేహితులలో సంతోష్ అనే యువకుడిది ముందు నుంచే రైతు కుటుంబం.. అయితే ఆకాష్ మాత్రం మెకానికల్ ఇంజనీర్ నుంచి రైతుగా మారాడు.. వీరిద్దరు కలిసి సాంగ్లీలో 11 ఎకరాల పొలంలో పండ్లు, కూరగాయలు, చెరుకు పండిస్తున్నారు. వీరు నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్ కి ఇప్పటికే 2.67 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారు టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం ఎలా చేస్తున్నారో ‘Indian Farmer’ యూట్యూబ్ ఛానెల్ లో చూడొచ్చు.. 

 

Leave a Comment