జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్.. నిషేధించిన వస్తువులు ఇవే..!

పర్యవరణాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, ఎగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకం పూర్తిగా నిషేధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే కాకుండా పాలీసెరేన్, ఎక్స్ టెండెడ్ పాలీసెరెన్, వాటి సంబంధిత ఉత్పత్తుల వాడకం పూర్తిగా నిషేధం.. 2021లో 75 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ ని ప్రభుత్వం నిషేధించింది. దానిని ఇప్పుడు 100 మైక్రోన్లకు వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారుచేసినా, అమ్మినా సంస్థ లైసెన్లు రద్దు చేస్తారు.  

నిషేధం ఎందుకు చేస్తున్నారు?

ప్లాస్టిక్ అనేది పర్యవరణానికి, ఆరోగ్యానికి అత్యంత హానికరం.. ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యి ఏళ్లకు పైగా పడుతుంది. ప్రపంప వ్యాప్తంగా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. మన ఇండియాలోనే 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతి అవుతుండగా.. ఏడాదికి 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఇండియా 98వ స్థానంలో ఉంది. అందుకే హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని ఆపి వేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ తీర్మానించింది. 

నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులు ఇవే..

  • ఇయర్ బడ్స్, బెలూన్స్, క్యాండీస్ లో వాడే ప్లాస్టిక్ పుల్లలు
  • ప్లాస్టిక్ ప్లేట్లు
  • ప్లాస్టిక్ గ్లాసులు
  • ప్లాస్టిక్ ఫోర్కులు
  • ప్లాస్టిక్ స్పూన్లు
  • ప్లాస్టిక్ కత్తులు
  • ప్లాస్టిక్ స్ట్రాలు
  • ప్లాస్టిక్ కవర్లు
  • ప్యాకేజింగ్ కి ఉపయోగించే కవర్లు
  • సిగరెట్ ప్యాకెట్లు, స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డులపై వేసే ప్లాస్టిక్ ఫిల్మ్ కవర్లు
  • 100 మైక్రోన్ల కంటే పలుచగా ఉండే పీవీసీ బ్యానర్లు
  • థర్మాకోల్
  • చాక్లెట్లు, ఐస్ క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు
  • ప్లాస్టికె జెండాలు

ప్రత్యామ్నాయం ఏంటీ?

  • ప్లాస్టిక్ స్టిక్స్ కి బదులుగా.. ఉడెన్ స్టిక్స్, పేపర్ స్టిక్స్
  • థర్మాకోల్ బదులుగా రిసైకిల్ చేసిన పేపర్ అట్టలు, హనీ కాంబ్ పేపర్
  • పేపర్ తో చేసిన ప్లేట్లు, గ్లాసులు, పాత్రలు, మొక్కజొన్న ఆధారిత పాత్రలు, ఆకులతో చేసిన ప్లేట్లు, మట్టి కప్పులు, స్టీల్ కప్పులు
  • పీవీసీ బ్యానర్లకు బదులు రీసైక్లింగ్ చేయగల పాలీఇతలిన్ ను ఉపయోగించవచ్చు. 

Leave a Comment