దేశంలో మోడీ ఆదుకుంది.. కేవలం అంబానీ, అదానీలనే : కేఏ పాల్

దేశంలో మోడీ  ప్రజా వ్యతిరేక పాల చేస్తున్నాయని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక విధానాన్ని ప్రగతి బాటలోకి తీసుకెళ్తానని, నల్లధనాన్ని తీసుకొస్తానని ప్రధాని మోడీ నేడు దేశాన్ని అప్పుల కూపంలోకి నెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసి దేశ సంపదను అంబానీలకు, ఆదానీలకు కట్టబెడుతున్నారన్నారు. 

50 లక్షల కోట్ల అప్పును 100 లక్ష కోట్లకు కోట్లకు పెంచి  దేశాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తున్నా మోడీకి దేశ ప్రజలు బై బై మోడీ అని యావత్ భారతం ముందుకు వచ్చి మోడీ పాలనకు చరమగీతం పాడాలన్నారు. దేశ ప్రజలకు, నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక్క  ప్రభుత్వ పథకం కూడా అమలు చేయకుండా చేశారన్నారు. 

మోడీ పాలనలో దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే విధంగా బీజేపీ  ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్  కలిసి , మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి కుట్రలు పన్నుతూ  తన పబ్బం గడుపుకుంటున్నారన్నారు. మతకల్లోలాలతో దేశాన్ని 100 ఏళ్ళు వెనక్కి నెట్టేశారని, GDP మైనస్ 13 పర్సెంట్ కి తీసుకెళ్లారని విమర్శించారు. దేశంలో ఎవరినైనా ఆదుకున్నారంటే  అది కేవలం అంబానీ, అదానిలనే అని, బీజేపీని ఓడించడం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని కేఏ పాల్ తెలిపారు. 

Leave a Comment