ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. పెరిగిన ఛార్జీలు ఇవే..!

ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్ రేట్లు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని, డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని తెలిపారు. 

బుధవారం మీడియా సమావేశంలో ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం నష్టాలను భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చిందని, నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్ సెస్ కింద ఛార్జీలు పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇది ఛార్జీల పెంపు కాదని గుర్తించాలని ప్రయాణికులను కోరారు. పల్లెవెలుగు కనీస ఛార్జీ ఇకపై రూ.10గా నిర్ణయించామని తెలిపారు. పెంచిన ధరలు ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. 

పెరిగిన ఛార్జీలు ఇవే..

పల్లెవెలుగు సర్వీసులపై రూ.2 చొప్పున, ఎక్స్ ప్రెస్ సర్వీసులపై రూ.5 చొప్పున, ఏసీ బస్సులకు రూ.10 చొప్పున డీజిల్ సెస్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు.  పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.10 నిర్ధారించామన్నారు. ఇది పూర్తిగా డీజిల్ పై విధించే సెస్ మాత్రమేనని, టికెట్ రివిజన్ కాదని ఆయన స్పష్టం చేశారు. 

 

 

  

Leave a Comment