అధికారులకే చెమటలు పట్టించిన పెద్దాయన.. బాష సినిమాని మించిన ఫ్లాష్ బ్యాక్..!

మనకు మహాత్ములు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అణగారిన పేదలకు ఏదైనా న్యాయం చేయాలి.. సాయం చేయాలి.. వారికి కొత్త ప్రపంచం చూపించాలి అనుకునే మనుషులు చాలా తక్కువ.. ఇక నాయకులు అంటారా.. ఇది అందరికీ తెలిసిందే.. దాదాపు 90 శాతం రాజకీయ నాయకులు మోసగాళ్లు, అవినీతిపరులే.. 

కానీ మనకు కళ్లకు ఎదురుగా బతికే ఒక గొప్ప మనిషి ఉన్నాడు.. ఆయన్ను ఎవరితో పోల్చిన సరితూగుతారో.. లేదో.. నిస్వార్థంగా తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి.. గిరిజనుల కోసం గత 30 ఏళ్లుగా ఆయన అడవుల్లోనే గడుపుతున్నారు.. అలా అని ఆయన చదువురాని వ్యక్తికాదు.. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి వ్యక్తులు ఆయన విద్యార్థులే.. హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. కానీ ఇవన్నీ ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. అసలైన జీవితం అడవుల్లోనే ఉందని వెళ్లిపోయారు. ఆయనే ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫెసర్ అలోక్ సాగర్.. మరీ ఆ మహనీయుడి జీవితం గురించి తెలుసుకుందాం.. 

అలోక్ సాగర్ జనవరి 20, 1950 ఢిల్లీలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత పీజీ చేసిన తర్వాత అమెరికా వెళ్లారు. హ్యూస్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు అక్కడే టీచింగ్ చేశారు. తర్వాత ఇండియాకు వచ్చేసి.. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన తమ్ముడు సైతం ఢిల్లీ ఐఐటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు..

ఇలా పాఠాలు చెబుతున్న ఆయనకు ఓ న్యూస్ పేపర్ లోని ఆర్టికల్ కదిలించింది. మధ్యప్రదేశ్ లోని గిరిజన జిల్లా అయిన బేతుల్ తో పాటు మరో జిల్లాలో ప్రజల కష్టాలు చూసి ఆవేదన చెందాడు. ఆ తర్వాత ఢిల్లీ ఐఐటీ నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, విద్యార్థులు, సహ ఉపాధ్యాయులు ఉద్యోగం వదలద్దని బతిమిలాడారు. కానీ ఆయన వినలేదు.. కొన్ని బట్టలు, సర్టిఫిక్ట్స్, పాస్ పార్ట్ తీసుకొని మధ్యప్రదేశ్ లోని కొచము అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్న గుడిసే నిర్మించుకుని జీవనం గడిపాడు.. 

ఆయనకు ఉన్న ఏకైక ఉద్దేశ్యం గిరిజనుల కోసం పనిచేయడం. వారి సమస్యలను పరిశీలించడం.. గ్రామంలో గిరిజనుల పిల్లలకు పాఠాలు చెప్పడం, రాత్రి సమయంలో రాయడం, చదవడం నేర్పించేవారు. తర్వాత కొన్నాళ్లకు మండల ఆఫీస్ కి వెళ్లి తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. అయితే వారు రోజూ తిప్పుకునే వారు.. ఆ తర్వాత తమ వల్ల కాదని, కలెక్టర్ ని కలవాలని చెప్పారు. 

దీంతో బేతుల్ జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి తమ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని కోరాడు. మొదట హిందీలోనే చెప్పారు.. ఆ కలెక్టర్ దక్షిణాది నుంచి వెళ్లిన వ్యక్తి కావడంతో ఆయనకు ఇంగ్లీష్ లో చెప్పారు. అరగంట సేపు అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడటంతో కలెక్టర్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకొని గ్రామానికి పాఠశాల మంజూరు చేశారు. అంతేకాదు గ్రామంలో విద్యుత్, రోడ్ల సమస్యపై కూడా కలెక్టర్ కి లేఖ రాశారు. 

ఇంత చేసినా ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ఎలరికీ చెప్పలేదు. సాధారణ జీవితమే గడుపుతారు. అందుకే ఆయనపై ఎవరికీ అనుమానం రాలేదు.. అయితే బేతుల్ జిల్లాలో ఎన్నికల సమయంలో స్థానిక నాయకులు ఆయనపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆయన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆయన ఎవరో తెలియక అక్కడ దురుసుగా ప్రవర్తించారు. 

చివరికి తాను ఢిల్లీ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అని చెప్పాడు. పోలీసు నమ్మలేదు. తర్వాత తన సర్టిఫికెట్లను ఒక్కక్కటిగా చూపించారు. దీంతో వారు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్లను ధ్రువీకరించిన తర్వాత ఆయన్ను విడిచిపెట్టారు. అలోక్ సాగర్ తన జీవితాన్ని వైట్ కాలర్ మనిషి నుంచి పూర్తిగా గిరిజన వ్యక్తిగా మార్చుకున్నాడు. 

Leave a Comment