సోషల్ మీడియా పవర్.. 4 గంటల్లో కొత్త బైక్ కొనిచ్చిన నెటిజన్లు..!

సోషల్ మీడియా తలచుకుంటే ఏదైనా సాధ్యమే.. అది మంచికైనా.. చెడుకైనా.. మంచికి వాడుకుంటే మాత్రం అద్భుతాలే జరుగుతాయి.. ఎంత పెద్ద సమస్య అయినా క్షణాల్లో తీరిపోతుంది.. అందుకు రుజువే ఈ ఘటన.. సోషల్ మీడియా సాయంతో జొమాటోలో డెలివరీ బాయ్ గా చేస్తున్న వ్యక్తికి కేవలం 4 గంటల్లో కొత్త బైక్ వచ్చింది..

వివరాల మేరకు.. రాజస్థాన్ కి చెందిన ఆదిత్య శర్మ అనే యువకుడు జొమాటో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు సైకిల్ పై వచ్చాడు దుర్గా మీనా. బైక్ లేక 42 డిగ్రీల మండుటెండల్లో సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేయడం చూసిన ఆదిత్య ఆశ్చర్యపోయాడు. దీంతో మీనా గురించి ఆరాతీశాడు ఆదిత్య..గతంలో ప్రైవేట్ టీచర్ గా పనిచేసేవాడినని, కరోనా సమయంలో ఉద్యోగం లేక జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరినట్లు చెప్పాడు మీనా..

ఫుడ్ డెలివరీలు చేస్తే నెలకు రూ.10 వేల వరకు వస్తున్నాయని, ప్రతిరోజూ ఇలా సైకిల్ పై 10 నుంచి 12 డెలివరీలు మాత్రమే చేయగలుగుతున్నానని అన్నాడు. దీంతో ఏదైనా సాయం కావాలా అని ఆదిత్య శర్మ అడిగాడు.. డౌన్ పేమెంట్ కట్టి బైక్ కొనిస్తే ఈఎంఐలు తానే కట్టుకుంటానని చెప్పాడు.. బైక్ ఉంటే డెలివరీలు ఎక్కువ చేస్తానని తెలిపాడు. 

దీంతో ఆదిత్య శర్మ ఆ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. క్రౌడ్ ఫండింగ్ కి వెళ్లడంతో 24 గంటలు గడిచే సరికి బైక్ కొనేందుకు అవసరమైన డబ్బులు వచ్చేశాయి. ఆ డబ్బులతో దుర్గా మీనా, ఆదిత్య శర్మ కలిసి బైక్ కొన్నారు. తాను బైక్ కొనుగోలు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరిరీ దుర్గా మీనా ధన్యవాదాలు తెలిపాడు. 

 

Leave a Comment