పెళ్లి నగలు అమ్మి చదివింది.. నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది..!

దేశంలో చాలా మందికి డాక్టర్ కావడం ఓ కల.. అందుకోసం మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు ఎంతో కష్టపడి చుదువుతుంటారు. వేలల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటారు.. అయితే ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ లేకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించింది ఢిల్లీకి చెందిన రితిక.. పట్టుదల ఉంటే ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది.. 

తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి బదర్ పూర్ లోని ఒక చిన్న ఇంట్లో నివాసముంటోంది రితిక. ఆమె తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ పనిచేసేవాడు. అయితే కరోనా కారణంగా రితిక తండ్రి ఉద్యోగం పోయింది. దీంతో వారికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. రితికకు డాక్టర్ కావాలని కల ఉండేది. అందులో భాగంగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు మొబైల్ ఫోన్, పుస్తకాలు అవసరమయ్యాయి. 

వాటిని కొనేందుకు రితిక తండ్రి వద్ద డబ్బులు లేవు. అయితే రితిక పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి స్మార్ట్ ఫోన్, పుస్తకాలు కొనుగోలు చేసింది. ఎంతో కష్టపడి చదివి నీట్ లో 500 మార్కులు సాధించింది. ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా 3,032 ర్యాంక్ సాధించింది. ప్రైవేట్ కోచింత్ తీసుకునే ఆర్థిక స్థోమత లేనందున యూట్యూబ్ క్లాసులు, కొన్ని పుస్తకాలు తీసుకుని సొంతంగా పరీక్షలకు సిద్ధమైనట్లు రితిక చెప్పింది. నీట్ లో మంచి మార్కులు సాధించడంతో తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.. 

  

Leave a Comment