స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు చిట్కాలు..!

ఈరోజుల్లో చాలా మందికి వేధిస్తున్న సమస్య సంతానం కలగకపోవడం.. పిల్లలు పుట్టలేదంటే అందరూ ఆడవారిలో లోపాన్నే ఎత్తి చూపిస్తుంటారు.. కానీ మగవారిలో ఉన్న లోపాలను అస్సలు చూపించరు.. మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.. ఒక మిల్లీ లీటర్ స్పెర్మ్ లో 15 మిలియన్ల కంటే ఎక్కువ శుక్రకణాలు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది..

స్పెర్మ్ కౌంట్ పెంచే చిట్కాలు:

స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వైద్యులను సంప్రదించి వాటికి సరైనా వైద్యం తీసుకోవాలి. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేందో చూద్దాం… 

  • ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి వారి జీవన శైలిలో మార్పులు రావడమే కారణం..శారీరక శ్రమ లేకపోవడం, ఆహార లోపాలు, మద్యం, పొగతాగడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి లాంటివి దీనికి కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
  •  మానసిక ఒత్తిడి వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. డిప్రెషన్ వల్ల వీర్య కణాల సాంద్రత, కదలికలు తగ్గుతాయి. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండాలి.
  • బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల అవి వీర్య కణాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేవు. పడుకునే ముందు బిగుతుగా ఉండే ప్యాంట్లకు బదులు వదులుగా ఉండే దుస్తులను వేసుకోవడం మంచిది.
  • ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకూడదు. 
  • వీర్య కణాలు తగ్గడానికి నిద్రలేమి కూడా ఒక కారణం. రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. 
  • శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా వీర్య కణాలు తగ్గుతాయట.. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తి అవుతుందట..
  • మద్యం తాగడం, పొగతాగడం వల్ల కూడా వీర్య కణాల ఉత్పత్తి సరిగ్గా ఉండదట.. పొగ తాగేవారిలో 22 శాతం వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక రోజుకు రెండు పెగ్గులు మద్యం తాగే వారిలోనూ వీర్యం ఉత్పత్తి తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. 
  • ఆహారంలోనూ పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, పీచు, రోగనిరోధక శక్తికి అవసరమైన విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అవుతాయి. 
  • వృషణాలకు దెబ్బ తగలడం, ఇన్ఫెక్షన్ లేదా కాన్సర్ రావడం.. కాన్సర్ కు కీమోథెరపీ, రేడియో థెరపీలు చేయించుకోవడం వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి.

 

Leave a Comment