ఆయుర్వేద సిగరెట్ కు పేటెంట్.. ఇది ఆరోగ్యాన్ని రక్షిస్తుందట..!

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. అంటూ ఎన్నో ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ సిగరెట్ బాగా అలవాటు అయిన వారికి ఇది చాలా కష్టం.. సిగరెట్ తాగడం మానేయాలని ఉన్నా.. అది కుదరని పని..ఎందకంటే ఒకసారి ఈ వ్యసనానికి బానిస అయితే.. మానడం చాలా కష్టం.. 

పొగతాగడం, పీల్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.. క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. పొగతాగడం వల్ల ఈ పొగ మెల్లగా శరీరంలోని ఒక్కో అవయవాన్ని దెబ్బ తీస్తుంటుంది.

అయితే  తాము తయారు చేసే సిగరెట్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అంటోంది ఓ ఆయుర్వేద సంస్థ. పుణెకు చెందిన అనంత్ వేద ఆయుర్వేద సంస్థ పదేళ్ల క్రితం తయారు చేసిన ఆయుర్వేదిక్ సిగరెట్ కు ఇప్పుడు ఇండియన్ పేటెంట్ హక్కులు లభించాయి. ధూమపానానికి అలవాటు పడిన వారికి ఈ సిగరెట్ ఓ వరం లాటిందని ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాజాస్ నిత్సూరే తెలిపారు. నికోటిన్, కార్బన్ దుష్ప్రభావాలను తమ ఆయుర్వేద సిగరెట్ ద్వారా నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ సిగరెట్ లో పొగాకు ఉండదని, అందులో తులసి, దాల్చిన చెక్క, లవంగాలు వంటివి వాడతారని ఆయన వెల్లడించారు. 

Leave a Comment