దోమలు కొందరికే ఎక్కువగా కుడతాయి.. ఎందుకో తెలుసా?

 దోమలు సాధారణంగా ఎక్కడపడితే అక్కడ కనిపించే కీటకం.. మనుషుల రక్తాన్నీ పీల్చేస్తుంటాయి. అయితే ఇంట్లో నలుగురు ఒకేచోట ఉన్నప్పుడు.. వారిలో కొందరికే దోమలు కుడుతుంటాయి. కొందరికి అస్సలు దోమలు కుట్టవు. ఆ.. తీపి రక్తం ఉంటే దోమలు ఎక్కువగా కుడతాయిలే అనుకోవచ్చు.. కానీ అది నిజం కాదు.. మరీ దోమలు కొందరినే కుట్టడానికి కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

దోమలు కొందరికే కుట్టడానికి కారణాలు:

  • ముదురు రంగుకు దోమలు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే దోమలు సులభంగా గుర్తిస్తాయి. వారిని దోమలు ఎక్కువగా కుడతాయి.   
  • దోమలకు కార్బన్ డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టమట.. 160 అడుగుల దూరం నుంచి కూడా కార్బన్ డై ఆక్సైడ్ వాసనను గుర్తించి మనుషుల వద్దకు వస్తాయి. మనం ఆక్సిజన్ పీల్చి.. కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాం.. ఆ కార్బన్ డై ఆక్సైడ్ వాసను గుర్తించి మనుషులను కుడతాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు కార్డన్ డై ఆక్సైడ్ ని ఎక్కువగా విడుదల చేస్తారు. అందుకే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. 
  • మనషుల శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటివి ఉంటాయి. అవి దోమలకు చాలా ఇష్టం.. ఎవరికైనా చెమటతో ఉంటే వారిని ఎక్కువగా ఆశ్రయించి కుడతాయి..
  • గర్భిణీలు కూడా కార్బన్ డై ఆక్సైడ్ ని ఎక్కువగా విడుదల చేస్తారు. అందకే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. 
  •  చర్మంపై సూక్ష్మక్రిములు అధికంగా ఉంటే దోమలు ఎక్కువగా వాలతాయి.. అందుకే చర్మాన్ని ఎప్పటికప్పుడు శభ్రంగా ఉంచుకోవాలి. దీంతో చర్మంపై సూక్ష్మక్రిముల సంఖ్య తగ్గిపోతుంది. చర్మంపై కురుపులు, గాయాలు ఉండకుండా చూసుకోవాలి.  

  

Leave a Comment