ఆ జాతరలో మహిళలకే ఎంట్రీ.. మగవారికి నో ఎంట్రీ.. ఎక్కడో తెలుసా.. 

ఆ గ్రామంలో జరిగే జాతరలో ప్రత్యేకించి మహిళలకు ఒక రోజును కేటాయిస్తారు.. మగవారు ఎవరూ ఆ రోజు జాతరకు వెళ్లకూడదు. అందుకోసం ప్రత్యేక బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తారు.. అలాంటి జాతర ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నారా.. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో జరుగుతుంది.. 

గ్రామంలో ప్రతి ఏడాది గ్రామదేవత సంగాలమ్మ జాతర నిర్వహిస్తారు. పది రోజుల పాటు ఆ జాతర జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ తీర్థం ప్రత్యకంగా మహిళల కోసం నిర్వహిస్తారు. తీర్థంలో మహిళలకు కావాల్సిన చీరలు, డ్రెస్సులు, గాజులు, బొట్టు బిల్లలు, ఫ్యాన్సీ ఐటమ్స్ తదితర వస్తువులు ఉంటాయి. వాటితో పాటు బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. 

ఈ తీర్థంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగి షాపింగ్ చేసుకుంటారు. పురుషులు ఎవరినీ ఉత్సవ కమిటీ సభ్యులు అనుమతించారు. మగవారు వెళ్లకుండా కర్రలతో కాపలా కాస్తారు. మగవారు లేకపోవడంతో ఈవ్ టీజింగ్, కామెంట్లు లేకుండా స్వేచ్ఛగా షాపింగ్ చేసుకుంటామని మహిళలు చెబుతున్నారు. ఇది మహిళలకు తామిచ్చే గౌరవంగా ఆ గ్రామస్తులు భావిస్తారు.. 

Leave a Comment