చనిపోయిన అక్కాచెల్లెళ్లు.. మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..!

ఈ విశ్వంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిలో పునర్జన్మ ఒకటి. అయితే ఈ సైన్స్ యుగంలో చాలా మంది పునర్జన్మలను నమ్మడం లేదు. కానీ సైన్స్ నే అబ్బురపరిచే ఓ వింత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికాకు చెందిన అక్కాచెల్లెళ్లు చినపోయి మళ్లీ పుట్టారు. 1957లో కారు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరూ 1964లో మళ్లీ పుట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. గత జన్మలో ఏ తల్లి కడుపున పుట్టారో.. మళ్లీ ఇద్దరూ అదే తల్లి కడుపున కవలలుగా పుట్టారు.. వారికి మాటలు వచ్చే వయస్సులో తమ గత జన్మలో జరిగి సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పరిశోధకులు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఈ పునర్జన్మ ఓ మిస్టరీగా మారింది. మొదటి జన్మలో వీరిద్దరూ కవలలు కాదు..

అమెరికాకు చెందిన జాన్-ఫ్లోరెన్స్ అనే దంపతులకు జొవాన్నా పొల్లాక్, జాక్వెలిన్ పొల్లాక్ జన్మించారు.. ఓ కారు ప్రమాదంలో జొవాన్నా, జాక్వెలిన్ ఇద్దరూ చనిపోయారు. ఆ సమయంలో జొవాన్నాకు 11 ఏళ్లు, జాక్వెలిన్ కి 6 ఏళ్లు ఉన్నాయి. అయితే 1964లో ఫోరెన్స్ కు ఇద్దరు కవలల పిల్లలు పుట్టారు. వారి పేర్లు గిలియన్, జెన్నిఫర్.. వీరికి మాటలు వచ్చే సరికి.. ఓ రోజు అటక పైన దాచిన పాత బొమ్మలు కావాలని తల్లిని అడిగారు.. అంతేకాదు వీరిద్దరు ఆ బొమ్మలను పంచుకోవడం చూసి ఆ తల్లి షాక్ అయింది. మూడేళ్ల వయస్సు ఉన్న ఆ చిన్నారులు చినిపోయిన ఇద్దరు పిల్లల ఫొటోను చూసి ఇది నువ్వు, ఇది నేను అంటూ గుర్తుపట్టారు. 

అంతేకాదు గతంలో జొవాన్నా, జాక్వెలిన్ చదువుకున్న స్కూల్, యాక్సిడెంట్ అయిన ప్రాంతాన్ని వీరు గుర్తుపట్టారు. అప్పటి వరకు ఈ కవలలు ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ చూడలేదు. అంతేకాదు వీరికి ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు అచ్చం జొవాన్నా, జాక్వెలిన్ లానే ప్రవర్తించేవారు.. దీంతో ఆ తల్లిదండ్రులకు ఓ క్లారిటీ వచ్చింది. చనిపోయిన తమ పిల్లలే మళ్లీ పుట్టారని నమ్మారు. ఆ కవలలకు ఏడేళ్లు వచ్చేసరికి గత జన్మ జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయారు. అప్పటి నుంచి సాధారణ పిల్లల్లా ప్రవర్తించడం చేశారు. కానీ అది ఎలా సాధ్యం అనేది మాత్రం ఇప్పటివరకు అంతుచిక్కలేదు.. అయితే ఈ పునర్జన్మ స్టోరీని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు..   

 

Leave a Comment