తల్లి ప్రేమ.. అమర జవాన్ కి గుడికట్టిన మాతృమూర్తి..!

అది ఛత్తీస్ గఢ్..జస్ పూర్ లోని పెర్వా ఆరా గ్రామం.. అక్కడికి వెళ్లిన వారికి రోడ్డు పక్కన ఓ గుడి లాంటిది కనిపిస్తుంది. అందులో ఏ దేవుడు ఉన్నాడో తెలుసుకోవడానికి వెళ్లిన వారికి అమర జవాన్ విగ్రహం కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిన వారు.. ఆ జవాన్ ఎవరు? ఈ గుడి కట్టించింది ఎవరు? అని అనుకుంటారు. ఇప్పుడు ఆ గుడి విషయాల గురించి తెలుసుకుందాం. 

ఆ జవాన్ పేరు బాసిల్ టోప్పో.. 2007లో బాసిల్ టోప్పో ఛత్తీస్ ఘడ్ పోలీస్ శాఖ లో చేరాడు. కానీ 2011లో జరిగిన విషాదం అతడిని అమరుడుగా చేసింది. బస్తర్ లో జరిగిన నక్సల్ దాడిలో బాసిల్ ప్రాణాలు విడిచాడు. కన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది.   

అమరవీరులు ఎప్పటికీ చనిపోరు. వారు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు. అదేవిధంగా నక్సల్ దాడిలో అమరుడైన పోలీస్ కానిస్టేబుల్ బాసిల్ టోప్పోని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని కోరుకున్నారు అతడి తల్లిదండ్రులు.. అందుకోసం స్థానిక రాజకీయ నాయకులను అభ్యర్థించారు. కానీ వారు వారి అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో సొంతంగా బాసిల్ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వారి ఇంటి ముందు ఉన్న చిన్న స్థలాన్ని కొనుగోలు చేశారు. కోల్ కతాకు చెందిన కళాకారులతో బాసిల్ విగ్రహాన్ని తయారు చేయించి.. ఆ స్థలంలో ప్రతిష్టించారు.

ఆ విగ్రహంలో తన కొడుకును చూసుకుంటుంది ఆ తల్లి. నిత్యం తన కొడుకును అక్కడే చూసుకుంటుంది. ఉదయం సాయంత్ర అన్నం తీసుకెళ్లి అక్కడే పెడుతుంది. విగ్రహంపై దుమ్ము పడకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంది. తన కొడుకు బతికే ఉన్నాడని, ఇక్కడే ఉన్నాడని ఆమె ప్రతి ఒక్కరికీ చెబుతుంది. 

 

Leave a Comment