మీ పిల్లలు జెంటిల్ మెన్ అవ్వాలంటే.. ఇలా చేయండి..!

జెంటిల్ మెన్ అంటే.. సానుకూల ద్రుక్పథకం కలిగి ఉండటం.. నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటం.. వయసుకు తగ్గట్టు ప్రవర్తించడం.. తమ చుట్టూ ఉన్న వారికి విలువలను విస్తూ.. తాము కూడా ఎంతో గౌరవాన్ని పొందడం.. ఇవే కదా జెంటిల్ మెన్ లక్షణాలు.. తమ పిల్లలు కూడా జెంటిల్ మెన్ గా ఉండాలని చాలా మంది పేరెంట్ కోరుకుంటారు.. మరీ మీ పిల్లలు జెంటిల్ మెన్ గా మారాలంటే చిన్నప్పుడే మీరు కొన్ని పనులు చేయాలి.. అవి ఏంటంటే..  

మీ పిల్లలు జెంటిల్ మెన్ అవ్వాలంటే..

  • పిల్లలు తమ తల్లిదండ్రులను చూస్తూ ఎదుగుతారు.. అందుకే తల్లిదండ్రులే పిల్లల రోల్ మోడలే అని చెప్పొచ్చు.. మీరు ఏవిధంగా ఉంటారో.. పిల్లలు కూడాా అలాగే ఉంటారు.. మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారో.. మొదట మీరు వారి ముందు అలాగే ఉండండి.. ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే వారికి అలవాటు చేయండి.. మంచి మర్యాద వారికి నేర్పండి. ఇతరులకు మర్యాద ఇవ్వాలని, సమయపాలన పాటించాలని చెప్పండి.. ఆ పనులు వారి ముందు మీరు కూడా చేస్తుండాలి. 
  • చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల చేత పనులు చేయించడానికి ఇష్టపడరు. కాని అలా చేయవద్దు.. మీ పిల్లల వయసుకు తగిన పనులు చెప్పాలి. పిల్లలు ఇంట్లో బాధ్యతాయుతంగా ఉంటే.. పెద్దయ్యాక కూడా అదే విధంగా ఉంటారు. 
  • పిల్లలను భావోద్వేగాల పరంగా బలంగా మార్చండి. వారి ముందు ఏడవడం, దుర్బలంగా మాట్లాడటం, తాము బలహీనులమని చెప్పడం చేయకండి.. ఎందుకంటే ఈ మాటలు వారిలో మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.. తామేమి చేయలేమనే భావాన్ని పెంచుతాయి. 
  • జీవితంగా నిజాయితీగా ఉండాలని పిల్లలకు చెప్పాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పండి. లైఫ్ లో ఇతరులను కష్టపెట్టకుండా ఉండాలని వివరించండి.. ఈ లక్షణాలు పిల్లలను జెంటిల్ మెన్ లా జీవించేలా చేస్తాయి..  

 

Leave a Comment