గీజర్ ని ఆన్ పెట్టి స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

ప్రస్తుతం ప్రతి ఇంట్లో గీజర్ ఉండటం సహజం.. చలి కాలంలో వేడి నీళ్ల స్నానం కోసం గీజర్ ని ఉపయోగిస్తుంటారు. అయితే కొందరు మాత్రం గీజర్ ఆన్ లో పెట్టి డైరెక్ట్ గా షవర్ స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో తెలుసా.. 

గీజర్ ఉంటే.. ఇలా చేయోద్దు..

  • గీజర్ ఆన్ లో పెట్టి స్నానం చేయవద్దు.. అలా చేస్తే గీజర్ లో కాయిల్ ఒత్తిడికి గురి అవుతుంది. దీంతో గీజర్ పగిలిపోయే ప్రమాదం ఉంది. గీజర్ ని టెక్నీషియన్ తో ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తూ ఉండాలి. 
  • స్నానం చేస పది నిమిషాల ముందు గీజర్ ని ఆన్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్ చేసి స్నానం చేయాలి. 
  • గీజర్ లో సరైన టెంపరేచర్ సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. వైరింగ్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే గీజర్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం గీజర్ స్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 

Leave a Comment