పండ్లు అమ్ముకునే నిరక్షరాస్యుడు.. స్కూల్ నిర్మించి, విద్య అందిస్తున్నాడు.. ఇప్పుడు పద్మశ్రీ హజబ్బగా..!

కరోనా వల్ల 2020,2021లో పద్మ అవార్డులను అందించలేదు. దీంతో ఇటీవల రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రెండేళ్ల పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. 2020 సంవత్సారానికి 119 మందికి అవార్డులు అందజేశారు. వీరిలో ఏడుగురికి పద్మవిభూషణ్, పది మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ లభించాయి. 2021 సంవత్సరానికి 141 మందికి అందజేశారు.

2020 సంవత్సారానికి గాను పద్మ అవార్డు అందుకున్న వారిలో కర్ణాటకకు చెందిన హజబ్బ ఒకరు.. మంగళూరు వీధుల్లో బత్తాయి పండ్లు అమ్ముకునే వ్యక్తి రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.. నిరక్షరాస్యుడు, చదువు విలువ తెలిసన వాడు కావడంతో పండ్లు అమ్మగా వచ్చిన సంపాదనతో స్కూల్ నిర్మించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన పద్మశ్రీ అందుకోవడంతో సోషల్ మీడియాలో ఆయన గురించి జోరుగా చర్చ జరుగుతోంది..

కర్ణాటకలోని మంగళూరు తాలుకా న్యూపాడ్పు గ్రామానికి చెందిన పండ్ల వ్యాపారి హరేకల హజబ్బ(68) నిరక్షరాస్యుడు.. స్థానికంగా ఆయన బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. ఒక రోజు హజబ్బ పండ్లు అమ్ముతుండగా ఓ విదేశీయుడు వచ్చి ఒక పండును ఇంగ్లీష్ లో అడిగాడు. అతడు అడిగిన దానికి హజబ్బ సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో హజబ్బ ఎంతో మధపడ్డాడు. ఇలాంటి పరిస్థితి ఊళ్లో పిల్లలకు రాకూడదనుకున్నాడు. 

అప్పటి నుంచి తాను సంపాదించిన దాంట్లో కొంత డబ్బు వెనకేయడం మొదలుపెట్టాడు. చివరకు ఆ డబ్బుతో పాటు మరికొంత డబ్బును విరాళం రూపంలో సేకరించి ఒక పాఠశాలను నిర్మించారు. ఆ స్కూల్ ప్రస్తుతం 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామంలో ప్రతి చిన్నారి చదువుకోవాలన్న ఉద్దేశంతో తన సంపాదనతో పాఠశాలను నిర్మించినట్లు హజబ్బ చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన హజబ్బ గొప్పతనం గురించి మీరేంమటారు ఫ్రేండ్స్.. 

Leave a Comment