థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి పోర్టబుల్ ఆస్పత్రుల నిర్మాణం..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం గురించి తెలిసిందే.. బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతే.. అంబులెన్స్ లు, ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని థర్డ్ వేవ్ కు గుజరాత్ లోని రాజ్ కోట్ యంత్రాగం సిద్ధమవుతోంది. పూర్థి స్థాయి వసతులతో పోర్టబుల్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. 

ఇండో-అమెరికన్ ఫౌండేషన్ సమకారంతో రాజ్ కోట్ యంత్రాంగం ఈ పోర్టబుల్ ఆస్పత్రుల నిర్మానం చేపట్టింది. మరికొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి పోర్టబుల్ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయి. ఆస్పత్రి నిర్మాణానికి కావాల్సిన పరికరాలను మొత్తం ఆ ఇండో అమెరికన్ ఫౌండేషన్ సమకూర్చింది. ఓ పూర్తి స్తాయి ఆస్పత్రిలో ఎటువంటి సదుపాయాలు ఉంటాయో అన్ని కూడా ఈ పోర్టబుల్ ఆస్పత్రిలో ఉంటాయి.

 ఈ ఆస్పత్రిలో 100 పడకలు, ఆక్సిజన్ పడకలు సైతం అందుబాటులోకి రానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రబలితే ఇలాంటి ఆస్పత్రులను వేగంగా సిద్ధం చేసి రోగులకు చికిత్స అందించవచ్చు. అసరమున్నన్ని రోజులు ఈ ఆస్పత్రులను వినియోగించి.. కరోనా వ్యాప్తి తగ్గిపోయాక వీటిని తొలగించవచ్చని రాజ్ కోట్ జిల్లా మెజిస్ట్రేట్ అరుణ్ మహేశ్ బాబు అన్నారు. తొలగించిన తర్వాత వారం రోజుల్లో ఆస్పత్రిని తిరిగి నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు.   

 

Leave a Comment