భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

ఓ మహిళ తన భర్తను ‘కుక్క’గా చేసి వీధుల్లో తిప్పింది.. అతడి మెడకు గొలుసు కట్టి కుక్క మాదిరిగా తన వెంట తిప్పుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రెజిల్ కి చెందిన లువానా కజాకి, ఆర్థర్ అవర్సో ఇద్దరు దంపతులు.. ఇద్దరు కలిసి తాజాగా ఓ ఫొటోషూట్ చేశారు. 

ఈ ఫొటో షూట్ లో లువానా ఆమె భర్తకు కుక్కలా మెడలో గొలుసు వేసి షాపింగ్ మాల్ కు, రెస్టారెంట్ కు తీసుకెళ్లింది. అక్కడ ఆమె భర్త ఆర్థర్ ను కుక్కను నడుపుతున్నట్లు తిరిగింది. భర్త కూడా కుక్కలా నడిచాడు. ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. ఆ దంపతులు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ పని చేసుకున్నారు. 

దీని గురించి లావానా భర్త ఆర్థర్ మాట్లాడుతూ తన ప్రేమను తెలియజేయడానికే తాను కుక్కలా మారానని, దీని వల్ల తాము ఎవరినీ బాధపెట్టలేదని చెప్పాడు. ఈ ఫొటో షూట్ గురించి ప్రజలు ఏమనుకున్నా తాము పట్టించుకోమన్నాడు. తాము ఎలాంటి చట్టవిరుద్ధమైన పనిచేయలేదన్నాడు. ఇతరులకు ఇది వింతగా అనిపించవచ్చని, కాని దీని వల్ల తమ ఇద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుందని తెలిపాడు.

కాగా గతంలోనూ కెనడాలో కూడా ఒక మహిళ ఇలాంటి పని చేసింది. ఒక మహిళ తన భర్తను గొలుసుతో కట్టేసి వీధుల్లో తిప్పిందిద. భర్తను కుక్క కంటే హీనంగా చూసింది. భర్త మెడకు గొలుసు కట్టి.. అతడిని మోకాళ్లు, చేతుల మీద నడిపించింది. తన కుక్కను నడపడానికి బయటకు వెళ్లినట్లు ఆమె చెప్పింది. వారు చేసిన పనికి ఆ భార్యాభర్తలు జరిమానా విధించాల్సి వచ్చింది. 

Leave a Comment