ప్రపంచంలోనే పురాతన హోటల్.. 1400 సంవత్సరాలుగా ఒకే కుటుంబం నడిపిస్తోంది..!

ప్రపంచంలో ఎన్నో పురాతన హోటళ్లు ఉన్నాయి. వాటి చరిత్ర తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. అలాంటితే జపాన్ లో హోటల్ శతాబ్దాలుగా నడుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతన హోటల్.. ఈ హోటల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకుంది. 

ఈ హోటల్ పేరు ‘నిషియామా ఒన్సెస్ కియుంకన్’. ఈ హోటల్ ను 705వ సంవత్సరంలో ఫుజివారా మహిటో అనే వ్యక్తి నిర్మించాడని చెబుతారు. ఈ హోటల్ నేటికి నడుస్తోంది. 1316 సంవత్సరాల పురాతనమైన ఈ హోటల్ ఇప్పుడు ఫుజివారా మహిటో కుటుంబానికి చెందిన 52వ తరం వారితో నడపబడుతోంది. 

ఈ పురాతన హోటల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే దీన్ని చూసేందుకు ఎంతో దూరం నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ హోటల్ కి ఒకవైపు  దట్టమైన అడవి, మరో వైపు అందమైన నది ఉంటాయి. అందుకే ఇక్కడి అద్భుతమైన దృశ్యాలు సందర్శకుల మనసులను కట్టిపడేస్తాయి. ఈ హోటల్ ని ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నారు. చివరి సారిగా దీన్ని 1997లో పునరుద్ధరించారు.    

Leave a Comment