ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ భయం పెట్టుకుంది. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న ఈ కొత్త వేరియంట్ కేసులు భారత్ లోనూ వెలుగుచూశాయి. ఈనేపథ్యంలో తమిళనాడులోని మదురై నగరం యంత్రాంగం ఆంక్షలు విధించింది. వచ్చే వారం నుంచి టీకా తీసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
షాపింగ్ మాల్స్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్ లతో సహా 18 ప్రదేశాల్లో అనుమతి నిరాకరించింది. వచ్చే వారం లోపు ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా వేయించుకోవాలని సూచించింది. టీకా వేయించుకోవడం కోసం ఒక వారం సమయం ఇచ్చింది. గడువులోగా టీకా తీసుకోని వారు మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర వాణిజ్య సముదాయాల్లోకి రాకూడదని మదురై జిల్లా కలెక్టర్ అనీశ్ శేఖర్ వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటక కూడా ఇదే తరహా ఆంక్షలు తీసుకొచ్చింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు మాత్రమే మాల్స్, సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చింది.