విమానాన్ని నెట్టుకుంటూ తీసుకెళ్లడం ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూడండి మరీ..!

రోడ్డుపై బస్సు లేదా కారు ఆగిపోతే.. ప్రయాణికులు దిగి తోయడం మీరు చూసింటారు. కానీ ఒక విమానం ఆగిపోతే ప్రయాణికులు దిగి తోయటం ఎప్పుడైనా చూశారా.. అయితే నేపాల్ లోని విమానాశ్రయంలో ప్రయాణికులు దిగి విమానాన్ని తోసుకుంటూ తీసుకెళ్లారు.. 

కోల్టీలోని బజురా విమానాశ్రయంలో నేపాల్ కు చెందిన తారా ఎయిర్ లైన్స్  విమానం టైర్ పేలడంతో రన్ వేపైనే ఆగిపోయింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక చేసేది లేక ప్రయాణికులు, సెక్యురిటీ సిబ్బంది ఆ విమానాన్ని పక్కకు నెట్టారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుశీల్ భట్టారాయ్ అనే నేపాలీ జర్నలిస్ట్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘బహుశా మన నేపాల్ లో మాత్రమే’ అని చమత్కరిస్తూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.    

Leave a Comment