నేపాల్ యువకుడికి తోక.. హనుమంతుడు అంటున్న జనం..!

సాధారణంగా జంతువులకు తోక ఉంటుంది.. మనుషులకు తోక ఉండటం అనేది ఇప్పటి వరకు అయితే వినలేదు. కానీ నేపాల్ కి చెందిన ఓ యువకుడికి వెనుక తోక పెరుగుతోంది.. ఇప్పటి వరకు 70 సెంటీ మీటర్ల వరకు తోక పెరిగింది. దీంతో ఆ యువకుడ్ని హనుమంతుడి ప్రతిరూపంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. 

నేపాల్ కి చెందిన దేశాంత్ అధికారి అనే 16 ఏళ్ల యువకుడికి వీపు కింద భాగం నుంచి తోక పెరుగుతోంది. ఆ తోక ఇప్పుడు సుమారు 70 సెంటీమీటర్ల పొడువు పెరిగింది. దేశాంత్ పుట్టినప్పుడే వెనక భాగంలో తోకను అతడి తల్లిదండ్రులు గుర్తించారు. ఆ తోకను తొలగించేందుకు అతడి తల్లిదండ్రులు దేశ విదేశాల్లోని ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు దానిని జన్యుపరమైన సమస్యగా చెప్పారు. 

తోక కారనంగా దేశాంత్ అసౌకర్యానికి గురయ్యేవాడు. ఎవరైనా చూస్తే అవహేళన చేస్తారేమో అని దుస్తుల్లోనే ఆ తోకను కవర్ చేసేవాడు. అయితే ఇటీవల దేశాంత్ తల్లిదండ్రులు ఒక పూజారికి ఈ విషయం చెప్పారు. ఇది విన్న ఆ పూజారి ఇది మాములు విషయం కాదని, హనుమంతుడి అంశ అని చెప్పాడు. దేశాంత్ దేవుడి ప్రతిరూపమని చెప్పడంతో.. అప్పటి నుంచి ఆ యువకుడిని హనుమంతుడి ప్రతిరూపంగా చూస్తున్నారు. 

దేశాంత్ కూడా తనకు తోక ఉన్న విషయాన్ని ఓ యూట్యూబ్ వీడియోలో ప్రపంచానికి చెప్పాడు. ఇప్పుడు తోక చూపించడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ యువకుడ్ని హనుమంతుడి అవతారంగా భావిస్తున్నారు. అతణ్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు.

 

 

Leave a Comment