చిరుతతో పోరాడి కూతురిని కాపాడుకున్న తల్లి..!

కన్న బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎలాంటి సాహసమైన చేస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డలను రక్షించుకుంటుంది. ఈ స్టోరీ కూడా అలాంటి తల్లిదే.. ఆ తల్లి చూపించిన ధైర్యానికి సెల్యూట్ చేయవచ్చు.. తన ఐదేళ్ల కుమార్తెను నోట్లో పట్టుకున్న చిరుత పులితో పోరాడి తన కూతురిని కాపాడుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని జునోనా గ్రామానికి చెందిన అర్చన తన గ్రామ సమీపంలోని అడవిలో కూరగాయల కోసం వెళ్లింది. అర్చన తనతో పాటు తన ఐదేళ్ల కూతురు ప్రజాక్తను కూడా వెంట తీసుకెళ్లింది. అక్కడ ఓ చిరుతపులి ఆమె కూతురిపై దాడి చేసింది. ప్రజాక్త తలను నోటితో పట్టుకుని లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తుంది. 

మొదట్లో చిరుతను చూసి భయపడినా.. తర్వాత తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని సిద్ధపడింది. పక్కనే ఉన్న వెదురు బొంగును తీసుకుని ఆ చిరుతతో పోరాడింది. చిరుత తన కూతుర్ని వదిలే వరకు వెదురు కర్రతో చితక్కొట్టింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక చిరుత ఆ చిన్నారిని విడిచిపెట్టి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయినా అర్చన భయపడకుండా ఆ చిరుతను కొట్టింది. దీంతో చివిరికి ఆ చిరుత అడవిలోకి పారిపోయింది. చిరుత దాడిలో ప్రజాక్తకు తీవ్రగాయాలయ్యాయి. అర్చన తన కూతుర్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. 

Leave a Comment