Sputnik Lite : సింగిల్ డోస్ వ్యాక్సిన్ తో 70 శాతం రక్షణ..!

ప్రాణాంతకమైన డెల్టావేరియంట్ ను రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ ‘స్పుత్నిక్ – లైట్’ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(RDIF) వెల్లడించింది. డేల్టావేరియంట్ నుంచి 70 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు గమేలెయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ చేసిన అధ్యయనంలో తేలిందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి మూడు నెలలు మెరుగైన రక్షణ ఇస్తుందని తెలిపింది. 

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ను స్పుత్నిక్ లైట్ 83 శాతం అడ్డుకుంటుందని ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. అదేవిధంగా ఆస్పత్రిలో చేరే ముప్పును 94 శాతం తగ్గిస్తుందని ప్రకటించింది. ఈ టీకా 60 ఏళ్ల వయస్సు కలిగిన వారిపై 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని గమేలెయ పరిశోధనల్లో వెల్లడైంది. కాగా ఈ స్పుత్నిక్ రెండు డోసుల వ్యాక్సిన్ ను 70 దేశాల్లో 4 బిలియన్ల జనాభాకు అందించారు. సింగిల్ డోస్ టీకాను 15 దేశాలకు పైగా సరఫరా చేశారు. ఇంకా 30 దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్నాయి. 

Leave a Comment