ఆకలి తీర్చుకునేందుకు.. దోమల బర్గర్లు తింటున్నారు..!

ఆఫ్రికా ఖండం అనగానే గుర్తొచ్చేది పేదరికం.. ఆ ఖండంలోని కొన్ని దేశాల్లో ప్రజలు పేదరికంతో మగ్గుతున్నారు. తినడానికి సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఏదీ దొరికితే వాటిని తినేస్తున్నారు. తాజాగా ఓ దేశంలో ఆఫ్రికన్లు దోమల బర్గర్లు తింటున్నారు. ఏంటీ దోమలు తింటున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారా.. 

అవును నిజమే.. దోమలతో బర్గర్ తయారు చేసుకొని తింటున్నారు.. ఆఫ్రికాలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అక్కడి ప్రజలు వాటిని గిన్నెల సహాయంతో పట్టుకుంటున్నారు. అలా పట్టుకుంటున్న దోమలను ముద్దగా చేస్తారు. ఆ ముద్దను నూనెలో బాగా వేయిస్తారు. ఈ బర్గర్ చాలా క్రంచీగా ఉంటుంది. 

వీటికి మసాలాలు లేకుండా రుచిగా తయారు చేసుకుని తింటున్నారు. ఒక్కో దోమల బర్గర్ తయారు చేసేందుకు దాదాపు 5 లక్షల దోమలు అవసరం అవుతుందట.. అంతేకాదు దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నయంటున్నారు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటుందట. గొడ్డు మాంసం కంటే 7 రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి త్వరగా జీర్ణమవుతాయని అంటున్నారు.    

Leave a Comment