రాకీ భాయ్ లా సిగరెట్లు తాగి.. ఆస్పత్రి పాలైన బాలుడు..!

సినిమాల ప్రభావం పిల్లలు, యువకులపై బాగా ఎక్కువగా ఉంటుంది. హీరోల స్టయిల్, డైలాగ్స్ చూసి నిజజీవితంలోనూ అనుసరిస్తుంటారు.. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. కేజీఎఫ్-2 సినిమా చూసి ఓ బాలుడు రాకీభాయ్ సిగరెట్ తాగే స్టయిల్ కి ఫిదా అయ్యాడు. 

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కి చెందిన 15 ఏళ్ల బాలుడు కేజీఎఫ్-2 సినిమాను చూసి రాకీభాయ్ క్యారెక్టర్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. సినిమాలో రాకీభాయ్ సిగరెట్ తాగే స్టయిల్ కి ఆకర్షితుడయ్యాడు. రాకీభాయ్ లాగా సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు. ఒకరోజులో ఒక పెట్టె సిగరెట్లు ఖాళీ చేసేవాడు. 

సిగరెట్లు ఎక్కువగా కాల్చడం వల్ల బాలుడికి తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు మొదలైంది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్యులు ఆ బాలుడికి గట్టిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చి ఇంటికి పంపించారు. పిల్లలు సినిమాలకు తొందరగా ప్రభావితం అవుతారని, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మన పిల్లలు కూడా హీరోలకు ఆకర్షితులై చెడు అలవాట్లకు బానిసలు అవుతుంటారు.. పేరెంట్స్ మీరు మీ పిల్లలై ఓ కన్నెసి ఉంచడం మంచింది.. 

Leave a Comment