ప్రపంచంలోనే ప్రాచీన ఆల్కహాలిక్ పానీయం.. వేదాల్లోనూ ప్రస్తావన?

ఆల్కహాల్ ని చాలా మంది మానసిక ఉల్లాసం కోసం సేవిస్తుంటారు. ఈ ఆల్కహాలిక్ పానియాన్ని ప్రాచీన కాలం నుంచి తాగుతున్నారట.. మన ఇండియాలోనూ రకరకాల ఆల్కహాలిక్ పానీయాలు అందుబాటులో ఉన్నాయట.. అలాంటి ప్రాచీన ఆల్కహాలిక్ పానీయాలలో ‘మీడ్’ ఒకటి.. దీనిని హనీ వైన్ లేదా పులియబెట్టిన తేనె పానీయం అని కూడా అంటారు.. మీడ్ ని ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఎక్కువగా తాగేవారని చరిత్రకారులు చెప్పారు. దీని తయారీలో సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలను కూడా వాడేవారట. మీడ్ అన్నింటికంటే ప్రాచీన ఆల్కహాలిక్ పానియమని అని చరిత్రకారులు చెబుతున్నారు. 

మీడ్ ను తయారు చేసేందుకు తేనె, తాజా ఈస్ట్, నిమ్మరసం, నీరు కలుపుతారు. దాదాపు ఏడాది పాటు పులిశాక అప్పుడు ఈ పానీయాన్ని తాగుతారు. ప్రాచీన కాలంలో మీడ్ ను ఔషధంగా ఉపయోగించేవారు. ఈ పానీయానికి కొన్ని మూలికలను కలిపి టానిక్ గా తయారు చేసేవారు. ఇది గ్లూటెన్ రహిత పానీయం.. అయితే దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. మితంగా తాగితే శరీరానికి మంచిదని నిపుణులు అంటున్నారు.. 

వేదాల్లోనూ ప్రస్తావన:

ప్రాచీన పానీయం మీడ్ ప్రస్తావన వేదాల్లోనూ ఉందట.. రుగ్వేదంలో ఈ పానీయంను ‘సోమ’ అనే పేరుతో పిలిచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రుగ్వేదంలోని కొన్ని శ్లోకాల్లో సోమ అనే పదం కనిపిస్తుందట. పురాతనగ్రీకులు ఈ పానీయాన్ని దేవతలపానీయంగా భావంచేవారు. 7000 BC  లో మీడ్ ఉత్పత్తికి సంబంధించి తొలి పురావస్తు ఆధారాలు ఉన్నట్లు ‘ద ఓల్డెస్ట్ ఆల్కహాలిక్ బేవరేజ్’ అనే పుస్తక రచయితలు రాజ్కో విద్రిహ్, జాంబే హ్రిబార్ చెప్పారు. అదేవిధంగా చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోని జియాహూ అనే నియోలిథిక్ గ్రామంలో 9000 ఏళ్ల నాటి కుండల్లో అల్కహాలిక్ పానీయ అవశేషాలు లభించాయట..అప్పట్లో మీడ్ ని ద్రాక్ష పండ్లు, తేనె, బియ్యంతో తయారు చేసేవారని తెలుస్తోంది.. ఆ తర్వాత ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమన్ సామ్రాజ్యం, మధ్యయుగ ఐరోపాలో ఉత్పత్తి చేశారట… 

Leave a Comment