పల్లీలు గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి..!

పల్లీలు తింటుండగా అవి గొంతులో ఇరుక్కుని రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు చీకటిగూడెంకు చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు బంగారు మైసమ్మ దేవాలయం వద్ద పండుగ చేసుకోవాలని భావించారు. అందుకోసం వారు బంధువులను, సన్నిహితులను పిలిచారు. 

ఈక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన శైలజ సోదరి రేణుక, ఆమె మల్లేశ్, రెండున్నరేళ్ల కుమారుడు అద్విత్ చీకటిగూడెంకు వచ్చారు. బంధువులంతా పండుగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో అద్విత్(2) వంటింట్లో ఉన్న పల్లీలను తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఒక్కసారిగా వేసుకోవడంతో అవి గొంతులో ఇరుక్కున్నాయి. దీంతో అద్విత్ కి ఊపిరి ఆడలేదు. గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పండుగ పూట ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Leave a Comment