రెప్పవేయకుండా సూర్యుడిని చూసి రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి..!

సాధారణంగా సూర్యుడిని కూలింగ్ గ్లాస్ లేకుండా చూడలేం.. ఎందుకంటే సూర్య కిరణాల ద్వారా కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఓ వృద్ధుడు మాత్రం సూర్యుడిని నేరుగా చూస్తూ రికార్డు క్రియేట్ చేశాడు. మధురలోని కన్హాలో ఉంటున్న 70 ఏళ్ల మహేంద్ర సింగ్ వర్మ రెప్ప వేయకుండా సూర్యుడిని చూసి ఈ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

సుమారు గంటా 26 నిమిషాల పాటూ సూర్యుడిని కన్నార్పకుండా చూశాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాలన్నదే మహేంద్రసింగ్ వర్మ లక్ష్యంగా పెట్టుకున్నారు.

తనకు త్రాటకం విద్య తెలుసని, దాని వల్లే ఇది సాధ్యమైందని మహేంద్ర సింగ్ వర్మ అంటున్నారు. త్రాటకం అంటే నల్ల బిందువును చూస్తూ చేసే ఒకరకమైన ధ్యానం. ఈ ధ్యానం వల్ల సూర్యుడిని కన్నార్పకుండా చూడగలిగినట్లు చెప్పారు. సూర్యుడిని నేరుగా కళ్లతో చూడడాన్ని ఆయన గత 25 సంవత్సరాలుగా సాధన చేస్తున్నారు. గతేడాది కేవలం గంట పాటూ చూసి రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా గంటా 26 నిమిషాలు చూసి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు. 

Leave a Comment