అర్ధరాత్రి రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో మెగా డాటర్ నిహారిక..!

బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ పబ్ పై శనివారం అర్ధరాత్రి సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సమయానికి మించి పబ్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకులతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రావడంతో పబ్ లోని యువతీ యువకుడు డ్రగ్స్ ని కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుననారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖులు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.. టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక, మాజీ ఎంపీ కుమారుడితో సహా మిగతా వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మెగా డాటర్ నిహారికను పీఎస్ కి తీసుకురాకుండా బయటకు పంపించడంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ వెంటనే నిహారికను పీఎస్ కి తీసుకొచ్చి విచారించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించారు.  

ఈ దాడి సమయంలో పబ్ లో గంజాయి, కొకైన్ తో పాటు ఎల్ఎస్డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పబ్ యాజమాలనుపై కేసు నమోదైంది. ఆ పబ్ లో గాలింపుచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.   

 

 

Leave a Comment